సాహితి

పక్షిదేహి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలిపటంలా
రెక్కలను బార్లాచాపి
యోగిధ్యానంలా నిశ్చలస్థితిలో ఉంచి
చప్పుడు చెయ్యకుండా
నేలకు దిగుతున్న పారాచ్యూట్లల్లా
అవి ఆకాశంలో చక్కర్లు కొడుతుంటే
ఆనందమూ ఆశ్చర్యమూ
ముప్పిరిగొనగా
నేనూ పక్షిదేహినయితే
ఎంత బాగుండును అనుకుంటాను
ముదురాకు పచ్చని
చిక్కని చెట్ల చీకట్లలో
కొమ్మపై కూచుని
రెక్కల్ని విసనకర్రల్లా
వెనక్కి విప్పార్చి వొళ్లు విరుచుకుని
ముక్కుతో ఒక్కొక్క ఈకనూ సవరిస్తూ
పక్కనున్న చెలికాని తల మీది
నాలుగు వెంట్రుకల్ని ముక్కుతో కరిచిపట్టి
తన వైపుకు లాక్కున్న దృశ్యాన్ని చూసి
నేనూ పక్షిదేహినయితే
ఎంత బాగుండును అనుకుంటాను.

తనతో సాహచర్యం నెరపిన భాగస్వామికి
గొప్ప కృతజ్ఞతతో
గుడ్లుపెట్టే సమయానికి
మెత్తని గూటిపక్కను సిద్ధం చేయాలని
వనమంతా తిరిగి
సన్నని ఆకుల ఈనెలు ఏరుకొచ్చి
గాల్లో ఎగిరివచ్చే సన్నని దూది పింజలను
వొడిసిపట్టీ
తుమ్మకొమ్మల చివర్ల
తూగుటుయ్యాలలు నిర్మించిన
దాంపత్య ధర్మానికి అచ్చెరువొంది
నేనూ పక్షిదేహినయితే
ఎంత బాగుండును అనుకుంటాను.
గుడ్లు పొదిగి పిల్లల్ని చేసి
కళ్లు తెరవని రెక్కలు మొలవని
కదిలే చిన్ని మాంసపు ముద్దల్లాంటి
తెరుచుకున్న పిల్లల సూర్యోదయాల్లాంటి
చిన్నినోళ్లల్లో
తన నోట పట్టితెచ్చిన
పురుగునో, గింజనో నోటికందిస్తున్న
వనె్నతరగని కన్నతల్లి ప్రేమను చూసి
నేనూ పక్షిదేహినైతే
ఎంత బాగుండును అనుకుంటాను.

అఖిలాండ కోటి
బ్రహ్మాండనాయకుణ్ణి
విశ్వానికి స్వామిత్వము వహించే విశ్వపతిని
ఖగపతి భుజాలపై మోస్తున్న
రమణీయ పరమపథాన్ని చూసి
నేనూ పక్షిదేహినైతే
ఎంత బాగుండును అనుకుంటాను.

- శిఖామణి, 9848202526