సాహితి

అంతా కొత్తగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా కొత్తగా ఆలోచిద్దాం

అంతరిక్షంలో క్రికెట్ పోటీలు పెట్టుకుందాం
జుపిటర్‌పై ఉద్యోగాలు వెలగబెడదాం
స్పేస్ హౌజ్‌ల్లో కాపురాలు కానిచ్చేద్దాం

రియల్ ఎస్టేట్ దందాని నెబ్యుల్లాదాకా విస్తరిద్దాం
వాటర్ టాబ్లెట్లను కనిపెడదాం
మీల్స్ క్యాంప్సూల్స్ ఉత్పత్తి చేసి
వ్యవసాయాన్ని చట్టుబండలు చేద్దాం

అంతా కొత్తగా -
బుధ గ్రహపు రోబోట్ అమ్మాయిని
కుజ గ్రహపు కళ్యాణ మండపంలో పెళ్ళాడి
శని గ్రహపు ఫాంహౌజ్‌ల్లోకి హానీమూన్‌కు వెళ్దాం
ఇంగ్లాండ్ క్లాక్‌టవర్ మీద నిలబడి
సూర్యునిపై చీకట్లను చల్లి రాక్షసులమై విహ్వలిద్దాం
భూమిని కార్క్‌బాల్‌ని చేసి
నేరుగా కృష్ణబిలంలోకి విసిరేద్దాం

అంతా కొత్తగా -
బాలమురళీకృష్ణ స్వరాలకి
మైక్ జాక్సన్ టోన్‌ని మిక్స్ చేసి
సరికొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుడదాం
ఇంటర్‌నెట్‌కి కళ్లని అతికేసి
అదే పనిగా మాటలే అవసరం లేని
మోడరన్ బ్రతుక్కి తెరలు తీద్దాం
కాలపు వేగాన్ని అధిగమించి
వయసును మరింత మరింత చిన్నది చేసుకుని
బచ్చాగాళ్ళమై పోదాం

క్రమక్రమంగా జరామరణాల్ని జయించి
మన పుటుకల మీద మనకే అసహ్యం కలిగేలా
మమీలమై తేలిపోదాం
చిరిగిన నాగరికత మీద చెరగని కుట్లై
చరిత్రగా మిగిలిపోదాం
అంతా కొత్తగా - బేరం చెట్లలా...

- సూరారం శంకర్, 9948963141