సాహితి

నాన్న ఊరెళ్లాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిద్ర లేవకముందే
సంచీ బుజాన వేసుకుని వెళ్లిపోతాడు
మొద్దు నిద్రలో మునిగి ఉన్నప్పుడు
చెమట తడితో తిరిగి వస్తాడు
తెల్లవారని చీకటో వెళ్ళిపోయేవాడు
సూర్యుడు కాదు,
అర్ధరాత్రి దాటాక గూడు చేరేవాడు
చంద్రుడూ కాదు
ఇప్పుడు నాన్న ఎలా ఉంటాడో జ్ఞాపకం రావడం లేదు

అమ్మా! నాన్న...?
నాన్న ఊరెళ్లాడు
ఏం తెస్తాడు?
నీకు బొమ్మలు, బట్టలు

అమాస, పున్నముల రాకపోకలు మారలేదు
నాన్న నివీధ గమనాగమనాలు మారలేదు
జ్ఞాపకాల్లో నాన్న రూపం
మరికొంత మసకబారింది

అమ్మా...?
నాన్న ఊరెళ్లాడు
ఏం తెస్తాడు?
గేదెను సంతకు తోలుకెళ్లాడు
ఇంటి సరుకులు, వడ్డీలకు చెల్లింపులు తెస్తాడు
బ్రతుకు రాస్తా గతుకులు, గుంతలమయమైనా
నాన్న చక్రాల క్రింద తన దేహాన్ని పరచి
సిమెంటు రోడ్డుగానే భ్రమింపజేశాడు.
ఋతువుల చక్రభ్రమణం ఆగలేదు
నాన్న రాత్రించరత్వమూ మారలేదు
అమ్మ కనుపాపల్లో కూడా
నాన్న రూపం ఆచూకీ దొరకలేదు

అమ్మా! నాన్న...?
నాన్న ఊరెళ్లాడు
పొలం కాయతాలు తీసుకుని
ఇంటి దస్తావేజులు మోసుకుని
ఏం తెస్తాడు?
ఆఖరి రూపాయ బిళ్లని
ఆశ చావని అలసిన కళ్లని.

బడి సెలవుల్లో అమ్మమ్మ వాళ్ల ఊరు
అప్పచ్చులూ, ఆటపాటలూ
తోటలో సీతాకోక చిలుకలతో
పరుగులు, కేరింతలు
మళ్లీ బడి - పై తరగతిలోకి
చదువు ఖరీదు రెట్టింపు
భవిష్య స్వర్ణ సౌధం కోసం
ఆఖరి రూపాయ గిట్టింపు
కాలంలో ఖర్చయపోతూ
రోజులు, వారాలూ
అమ్మ ముఖం కళ తప్పింది
కళ్లల్లో వెలుగు మాసిపోయంది.

అమ్మా! నాన్న...?
నాన్న ఊరెళ్లిపోయాడు
ఏం తెస్తాడు?
పుట్టెడు దుఃఖాన్ని, కొండంత భారాన్ని
ఏం తీసుకెళ్లాడు?
నుదుటి కుంకుమ బొట్టును
మెడలోని తాళిబొట్టును!
పెద్దయ్యాక తెలిసొచ్చింది
నాన్న బ్రతుకు పోరాటంలో
క్షతగాత్రుడు -హత ప్రాణుడు అని.

- వై. రామకృష్ణారావు 8985743964