సాహితి

స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ రోజైనా మీరు రావచ్చు
మా హృదయాలలోకి
మా గదుల్లోకి
ఎప్పుడిష్టమైతే అప్పుడే పోవచ్చు
అనుకోవడానికి ఏముంది

కిటికీలు తెరవచ్చు
పంఖాలు వేయొచ్చు
సోఫాలో కూర్చోవచ్చు
మంచినీళ్లు తాగొచ్చు
సెల్ఫ్‌లోంచి తీసుకొని
ఏ పుస్తకం పేజీనైనా చేరవచ్చు

మీరు కోరితే
స్నేహితులను వెంటేసుకు రావచ్చు
ఏ రంగు దుస్తులైనా ధరించి
ఏ భాషనైనా మాట్లాడి
ఏ అవసరమైనా వివరించి
సహాయం పొందవచ్చు

చురుకైన రెండు చేతులు
చక్రాల్లాంటి రెండు కాళ్లు
చలాకైన రెండు కళ్లు
అనంత నిర్మలాకాశం
మూడో మనో నేత్రం
సర్వాధిక స్వేచ్ఛా ప్రపంచం
మా ఇంట్లో ఉంది
రండి
స్వాగతం
మీరు రావచ్చు
అన్ని తలుపులూ తెరిచే ఉంచా
అన్ని కిటికీలూ తీసే ఉంచా

మరో రెండు భోజనాలు
వండమని నా భార్యకు చెప్పా
చాలా మంచిది, వండి ఉంచుతుంది

మీరు రావచ్చు
అలలు
అలలుగా
నా గురించి ప్రశ్నించవచ్చు

తెరలు తెరలుగా
నాతో చర్చించవచ్చు
రాత్రయతే
భోంచేసి
నా పక్క మీదే
పక్కనే పవళించవచ్చు

పొద్దునే్న
బస్సుకో ట్రైన్‌కో పోవచ్చు

ఫరవాలేదు
మీరు రావచ్చు
మొహమాటం ఎందుకు
మాది కవుల ఇల్లు

- విజయచంద్ర 9438720409