సాహితి

విత్తన ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతిపెట్టబడ్డ విత్తనమిపుడు
మట్టి పెళ్ళలను పెకిలించుకొని
ఉనికి కోసం యుద్ధానికి సిద్ధం

తరతరాలుగా భుక్తికై
పోరాటాలలో రక్తం చిందించిన
కర్షక జీవుల చెమట చుక్కలకు
బావుటాగా ఎగరడానికి సిద్ధం
కలుషిత నదులలో మునిగి తేలుతూ
అవినీతి పాపపు పంకిలంలోనుంచి
మొలకెత్తి
రేపటి జీవికకు చేసే
తొలి ప్రయత్నమిది!!!
మనిషి స్వార్థంలోంచి
సారాన్ని సహనాన్ని ధారపోస్తూ
బతుకు నీడకు కబళిస్తున్న
నవ నాగరికతను చూసి కూడా
తనను తానూ వొలుచుకుంటూ
వొద్దికగా వొదిగి పోయింది కదా...

కాలం సహకరించనపుడు
గిడ్డంగులలో వొదిగి ఉన్న బిడ్డలను
బస్తాలలో కుక్కుతుంటే
పందికొక్కుల ఆకలికి
ఆహారం అయినప్పుడు కూడా
తలెత్తుకు తిరగటం లేదు
తనని తానూ సమాధి చేసుకుంటూ
బతుకు మూలాలను
తెలుసుకోడానికి
బయలుదేరుతుంది
చీల్చబడ్డ అవని సాక్షిగా
రేపటి మెతుకు మట్టిపై
రెపరెపలాడుతుంది!!

- పుష్యమిసాగర్, 9032215609