సాహితి

మా ఊరు మారిపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా ఊరు మారిపోయింది
ఊహకందని వింతగా-
పొలాల్ని హలాలు దున్నటం లేదు
దున్నటానికి యంత్రాలు వున్నా
దున్నించుకోటానికి పొలాలు లేవు
రియల్ ఎస్టేటు కాంక్రీటు అడవులు
సస్యశ్యామలాన్ని తినేశాయి!
బస్సు చూడని మావూళ్ళో
నడిచి నడవని పిల్లక్లాసుల
రంగురంగు బొమ్మల వ్యాన్లు
ఇంటింటా ఆగి
ఇంగ్లీషులో స్వాగతం చెబుతున్నాయి!
కాలేజి బస్సులు
కానె్వంటు వాహనాలు
టోకుగాను చిల్లరగాను
శీతలంలో విద్యార్థుల్ని
వూరించి చేరవేస్తున్నాయి!
మట్టిలో పొర్లాడిన
మా వూరి రోడ్లు
అభ్యంగన స్నానంచేసి
సిమెంటు రోడ్లను
నెత్తికెత్తుకున్నాయి!
చద్దికూట్లో పెరుగు
మజ్జిగలో మునకేసిన వూరు
పాల వ్యానుకు అమ్ముడై
వొట్టిపోయిన వొంటితో
సర్కారు దవాఖానా చేరింది!
చుట్టలు బీడీలు
తంబాకు చెట్టెక్కి
సిగరెట్లు బంగాకు
సేదతీరుస్తున్నాయి!
విశాల శ్మశానాన్ని
ఆక్రమించిన శివయ్యలు
విశ్రాంతి భవనాల్ని నిర్మించి
ప్రభుత్వ పట్టాలు చేపట్టారు!
మద్యపానం జన్మహక్కంటూ
ప్రజలు అదే దిక్కంటూ ప్రభుత్వం జేజేలు
బెల్టుషాపులు సమూహాలై
బొమ్మలు కొలువులు!
మా ఊరు మారిపోయింది
ఊహకందని వింతగా-

- అడిగోపుల వెంకటరత్నమ్ 9848252946