సాహితి

భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దానికొక రూపం ఉంటుందని
భ్రమలో ఉండే వాళ్ళం

మారణఆయుధం ఎదురైనప్పుడు
క్రూర మృగం మోరలెత్తినపుడు
అంతులేని అగాధం అంచున
దిక్కుతోచక దిగాలుపడినప్పుడు
చీకటి చిందులేసినప్పుడు
స్వార్థం బుసలుకొట్టినప్పుడు
భయం గుప్పిట్లో బందీలమని
భ్రమపడే వాళ్ళం

దొరతనపు స్వభావం లాగ
శతృవుల రూపంలాగ
కనిపించని వేదనలాగ
భయం కూడా
అదృశ్యం

ఒక వార్తలానో
సంచారవాణిలోనో
సంక్షిప్త సమాచారంగానో
ఈ సందేశ రూపంతోనో
భయం భూతం రావొచ్చు
చేయని తప్పులకు
రాయని రాతలకు
ఊహించని లోతులకు
దిగి
నీ గుండెల్లో
గునపాన్ని దించవచ్చు

పరిహాసపు ప్రశ్నలానో
వంకర విచారణగానో
అడిగీ అడగనట్లు
ఇంకెవర్నో విచారించినట్లు
నీ ముందు భయం తిరగాడుతుంది

భయం మహా మాయావి
దానికి రూపం లేదు

- ఏనుగు నరసింహారెడ్డి 8978869183