సాహితి

కన్నీటి ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవూ నేనూ ఒకటే
గాలి లేని కన్నీటి మధ్య
ప్రయాణించిన వాళ్లం!
దుమ్మునిండిన మనసును
కౌగిలించుకున్న వాళ్లం!

ఎప్పుడు లేని దుఃఖం ఇప్పుడెందుకలా?
ఎవరో ప్రశ్నిస్తున్నారు ఆవలనుండి
వాడు శత్రువా మిత్రుడా తెలియదు
ఎప్పుడూ వున్నదే!
మనసు దాటి రాలేదు
కను రెప్పల స్నేహితాన్ని విడిచిపెట్టలేదు
ఇప్పుడు మనసు కురిసిన వర్షానికి
వరద పారిన కన్నీరు
ఆగుతుందా?
కట్టలు తెంచుతుందా నాకు తెలియదు
నీవూ నేనూ ఒకటే
మట్టిని నమ్ముకున్న వాళ్లం
చెమట ముద్దాడిన వాళ్లం
ప్రయాణం సజావుగా సాగిందా?
అడగటానికేం లేదు
కష్టాలు కన్నీళ్లు తప్ప
నీవూ- నేనూ ఒకటే-
కోకిలమే కాని
కాకులుగా తయారయ్యాం

- సిహెచ్.మధు, 9949486122