సాహితి

శివలెంక రాజేశ్వరి అముద్రిత కవిత......... నీ కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీ కోసం
మళ్లీ పుట్టి పెరగాలనుంది
నేనెవరో చెప్పాలనుంది

నీతో మాటాడిన ఈ రాత్రి
నాతో కెరటాలు కొట్టుకుంటున్నాయి

ఏదో ప్రచ్ఛాయ నన్ను వెంటాడుతోంది

నాకే అర్థంకాని సంగతులు
నన్ను కలవరపెడుతున్నాయి

నీ కోసం అమృతం తాగాలనుంది
ఏవో తెరలు తొలిగిపోతున్నాయి
దేహం కాలపరీక్షకు నిలవలేక
రూపదీపాలు ఆరిపోతాయి

నీవు ‘ఇక వుంటాను’ అన్నాక కూడా
నేను నీ పేరు పెట్టి పిలుస్తాను
హఠాత్తుగా విద్యుత్ పోయినట్టుగా
మాట ఆపేసెయ్యడమే సరైనది

నీతో నేను మాటాడింతర్వాత
నేను వాత్సల్య రాగాన్నవుతాను
నా కలత తీరి నిద్ర వస్తుంటుంది
చల చల్లగా మెల్ల మెల్లగా
రావె నిదుర హాయిగా
నేను నీకు స్నేహితను
నేను నీకు అమ్మను

నేను నీకు అమ్మని కావటానికి
నా మాలిన్యాన్నంతటినీ కడిగేసుకోవాలేమో!
గంగామాత ఒడిలోకి చల్లగా వెళ్లిపోవాలి

అయినా కాని
నా కన్నీరు నన్ను స్వచ్ఛంగా వుంచుతుంది
ఎవరైనా అంతే

నీ మాటలు నీ అక్షరాలు అయితే మంచిది
నా మనసులో ఆఖరి పాటలైనాయి

ఈ రాత్రి విషాదంగా మారిపోయింది
ఎంత విషాదమనీ
అనాధ స్ర్తిల అవమానాలన్నీ
చరిత్ర హీనుల బాధావమానాలన్నింటినీ
సమస్త మానవాళి జీవన విషాదాన్నంతా
నేను మోస్తున్నట్టుగానే వుంది. *