సాహితి
మహాకవీ.. మన్నించండి!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దేశమును ప్రేమించమంటివి
మంచియన్నది పెంచమంటివి
పరాయి దేశమును ప్రేమించుచుంటిమి
కిరాయి సంస్కృతి నేరుగా దించుతుంటిమి
మహా జోరుగా పెంచుతుంటిమి
ఈసురోమని మనుజులుండరాదని
దేశ జనులను ఆదేశించినావు
మంది తినెడి కందిపప్పే...
కేజీ వంద కంటే కింద దిగదే
భూసురుడైనా ఈసురోమనక
భేషుగ్గా ఎటులుండగలడే!
తిండి కలిగిన, కండ కలిగిన
నిండు మనుషుల మెండైన భారతాన్ని
గుండె నిండా ఆకాంక్షించినావు
కానీ,
తిండి పైనే ఆంక్షలుండే,
మొండి రోజులు దాపురించెను
ఆకులందున అణిగి, మణిగి,
కవిత కోకిల పలక మంటివి
కులం వారీ... ప్రతిఫలం కోరే
కలం పట్టిన కవులు వచ్చిరి
దేశమంటే మట్టి కాదని
గట్టిగానే గొంతెత్తినావు
మీ మాటను (పెడ)చెవిన బెట్టిన నేతలంతా
మట్టినిక మిగల్చబోమంటూ...
పట్టుబట్టీ ప్రతిన బూనారు
చెట్టు పుట్టా... చెరువు గట్టు
గనుల గుట్టా... పొలం పుట్రా
కంపెనీలకు తాకట్టు పెట్టినారు
మట్టి మనుషుల పొట్ట గొట్టినారు
గురజాడ మహాకవీ! మన్నించండి.
డామిట్! మీ కల అడ్డం తిరిగింది.
మా జాతీయ పక్షి మయూరం.
ఇక, మా జాతీయ హీరో... గిరీశం!