జాతీయ వార్తలు

సల్మాన్ కన్నీటి పర్యంతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 10: ఎంతవారికైనా ఆనందం, విషాదం ఒక్కటే. ఇది సంపదతో కొలవలేనిది. మానవీయ కోణమే దీనికి కొలమానం. బాలీవుడ్ టాప్‌స్టార్ కోటానుకోట్ల మంది జన నీరాజనాలు అందుకుంటున్న సల్మాన్‌ఖాన్ కన్నీటిపర్యంతమయ్యారు. ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయారు. మానసికంగా ఇనే్నళ్లుగా ఆయన పడ్డ వేదన, ఆవేదన కన్నీటి రూపంలో బయటపడింది. పదమూడు సంవత్సరాల నాటి హిట్ అండ్ రన్ కేసులో ఎన్నో ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్న ఆయన్ని హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఉద్విగ్నానికి లోనుచేసింది. తీర్పు వెలువడగానే న్యాయమూర్తి వైపు తిరిగి తలవంచి అభివాదం చేశాడు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన భారమంతా దిగిపోయేలా, అనుక్షణం బిగపట్టిన శ్వాసను ఒక్కసారిగా వదిలి ఊరట చెందాడు. 2002 నాటి హిట్ అండ్ రన్ కేసులో బాంబే హైకోర్టు గురువారం ఆయన్ను నిర్దోషిగా తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ఎ.ఆర్.జోషి తీర్పు పాఠం చదవగానే సల్మాన్‌ఖాన్ భావోద్వేగం కట్టలు తెంచుకుంది. ఇన్నాళ్లూ దాగిన ఆవేదనకీ, ప్రస్తుతం అనుభవిస్తున్న ఆనందానికీ సంకేతంగా ఆయన కళ్లల్లోంచి నీరు ఉబికి వచ్చింది. కోర్టులోపల గోడకు ఆనుకుని మెల్లగా ఓ పాట పాడుకుంటూ తన భారాన్ని దించుకున్నాడు. ఒకపక్క హర్షాతిరేకాలు వినిపిస్తుంటే సల్మాన్ మాత్రం గోడకు ఆనుకుని కన్నీరు పెట్టడం చూసిన బాడీగార్డ్ షేరా వడివడిగా వచ్చాడు. సల్మాన్ కళ్లవెంబడి కారుతున్న కన్నీళ్లను చూసి, గోడవైపు తిరిగి నిలబడాలని సూచించాడు. కొన్ని క్షణాల అనంతరం తేరుకున్న సల్మాన్ తన కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో ఆనందాన్ని పంచుకున్నాడు. జీన్స్‌ప్యాంట్, నలుపు తెలుపు గళ్ల చొక్కా వేసుకొచ్చిన సల్మాన్ కోర్టు హాల్లో ఉత్కంఠ క్షణాల్నీ ఆనందం, భావోద్వేగం కలగలసిన క్షణాలను ఏకకాలంలో అనుభవించాడు. హిట్ అండ్ రన్ కేసులో విచారణ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష విధించడం, దానిపై బాంబే హైకోర్టులో అప్పీల్ చేయడం తెలిసిందే. సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన మరుక్షణమే కుటుంబ సభ్యులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు మిన్నంటాయి. సల్మాన్ సోదరి అల్వీరా విజయసూచకంగా తన చేతి బొటనవేలిని విలేఖరులకు చూపిస్తూ తన హర్షాన్ని వ్యక్తం చేసింది.
====================
సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యోక్తుల హోరు
హైదరాబాద్, డిసెంబర్ 10: మద్యం తాగి కారు నడిపి ఫుట్‌పాత్‌పై పడుకున్న ఒక వ్యక్తి మరణానికి కారకుడైన కేసులో సల్మాన్‌ఖాన్ నిర్దోషని ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఈ తీర్పే ప్రధాన అంశంగా నిలిచింది.
అలాంటి వాటిలో మచ్చుకు కొన్ని...
* 2002లోనే భారత్‌లో డ్రైవర్ రహిత కార్లు ఉండేవని సల్మాన్ ఖాన్ కేసుతో రుజువైంది.
* సల్మాన్ మద్యం తాగలేదు. తాగింది ఆయన కారే.
* సల్మాన్‌ను జైలుపాలు చేసే కుట్రతో కారు కింద పడిన వారిలో ఒకరు చనిపోయారు. మిగిలిన నలుగురిపై
కేసు పెట్టనందుకు ప్రాసిక్యూషన్ వారికి కృతజ్ఞతలు.
* మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే. పిస్టల్‌కు లైసెన్స్ ఇచ్చింది ప్రభుత్వమే కాబట్టి నేరం ఖాన్‌ది కాదు ప్రభుత్వానిది.
* మద్యం తాగి కారు నడిపి చంపలేదు. జింకనూ వేటాడలేదు. ఆ జింకే నన్ను చంపు అని సల్మాన్‌ను బతిమిలాడింది. అయినా వినకపోతే పిస్టల్ లాక్కోని ఆత్మహత్య చేసుకుంది.
* మందు తాగింది ఖాన్ కాదు. వాళ్లకే మందెక్కువై ఖాన్ కారు కింద పడ్డారు.
* చలికాలం జలుబు చేస్తుందని తెలిసినా రోడ్డుపక్కన పడుకోవడం వారి తప్పు. పేదలకు ఇళ్లు కట్టివ్వని ప్రభుత్వానిది తప్పు అంతే కానీ సల్మాన్ ఖాన్‌ది తప్పు కానే కాదు.
* స్వచ్ఛ భారత్.. స్వచ్ఛ సల్మాన్
* తీర్పు రాయడానికి న్యాయమూర్తికి మూడు రోజులు పట్టింది. ఒక స్కిృప్ట్‌కు సల్మాన్ ఖాన్ అసోసియేట్‌గా ఉండడం ఇదే మొదటిసారి.