సంజీవని

గొంతు వాపు వస్తే అప్రమత్తత అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొంతువాపుని పట్టించుకోకుండా వదిలిపెడితే చాలా ఇబ్బందులకు దారితీస్తుంది. ఎందుకంటే, గొంతు వాపు చాలా అనారోగ్య ప్రారంభ దశలను సూచిస్తుంది. ప్రధానంగా మెడ వాపుని రెండు రకాలుగా విభజించవచ్చు. మధ్యవాపు వున్నది, ప్రక్కల వాపు వున్నవి. మధ్యవాపు సాధారణంగా థైరాయిడ్ ఇబ్బందులలోను, లింఫోనోడ్ వాచినపుడు, పుట్టుకతో వచ్చే అనారోగ్యాలకి, లాలాజల గ్రంథి సమస్యలకి సంబంధించి ఉంటుంది. పక్కన వాయడం సాధారణంగా లింఫ్‌నోడ్ పెరిగినపుడు వచ్చే రకరకాల ఇన్‌ఫెక్షన్స్, క్యాన్సర్‌కి సూచిక. అనుకున్నాం కదా, గొంతు మధ్య వాపు థైరాయిడ్ గ్లాండ్ పెరుగుదలకి సూచికా అని! స్వరపేటిక, లారింక్స్ కింద సీతాకోక చిలుక ఆకారంలో ఈ గ్రంథి ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంది. మన శరీరంలోని ఎన్నో అరుగుదల కార్యక్రమాలకి థైరాయిడ్ హార్మోన్ సహకరిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పెరగడానే్న ‘గాయిటర్’ అంటారు. గ్రంథి మొత్తం పెరిగితే ‘డిఫ్యూజ్‌డ్ గాయిటర్’ అంటారు. గ్రంథిలో అక్కడక్కడ వాపు ఉంటే ‘నాడ్యూలార్ గాయిటర్’ అంటారు. ఈ రెండు రకాల గాయిటర్‌లకు గొంతు వాపులకు కారణం అయోడిన్ లోపము. థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్ ఎక్కువైతే, ‘హైపర్ థైరాయిడిజం’ వస్తుంది. తక్కువైతే ‘హైపోథైరాయిడిజం’ వస్తుంది. ఒక్కోసారి థైరాయిడ్ కాన్సర్‌లో కూడా ‘నాడ్యూలార్ గాయిటర్’కి దారితీస్తుంది. అందుకనే గొంతు వాపు కనబడగానే సరైన వైద్యుడికి చూపించుకోవడం అవసరం.
ప్రారంభ దశలో చికిత్స పొందితే ఈ కాన్సర్‌ని అదుపులోకి తీసుకురావచ్చు. కొన్ని రకాల థైరాయిడ్ కాన్సర్‌లు ప్రారంభ దశలో లింఫ్‌నోడ్స్ వాయడంతో గొంతుకి అటు- ఇటు వాపు రావచ్చు. థైరాయిడ్ గ్లాండ్‌లో మార్పు ఏమీ వుండకపోవచ్చు. కాబట్టి గొంతు వాపు కనిపిస్తే, వైద్యుడికి చూపించి, చికిత్స పొందాలి. ముఖ్యంగా థైరాయిడ్ కాన్సర్‌ని ప్రారంభంలో కనుక్కుని అదుపులో పెట్టాలి.
థైరాయిడ్ ద్వారా వచ్చే గొంతు వాపుని నిర్లక్ష్యం చేస్తే, మెడ ముందు భాగంలో వాపు పెద్దదై శ్వాసించడం కష్టం అవుతుంది.
ఈ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే గొంతు వాపుని ప్రారంభ దశలోనే కనుక్కుని థైరాయిడ్ వాపుని గుర్తించి చికిత్స చేయించాలి. గొంతువాపులోంచి ‘ఫైన్ నీడిల్ ఆస్ఫిరేషన్’తో చిన్న కణజాలాన్ని తీసి బయాప్సీ చేసి, థైరాయిడ్ వాపుని, గాయిటర్‌ని గుర్తించవచ్చు. ఆ వాపు ప్రమాదకరమైనది కాకపోతే అల్ట్రాసౌండ్‌ని చేస్తారు.
థైరాయిడ్ గ్రంథి వాపు, థైరాయిడ్ హార్మోన్ గ్రంథి ఉత్పత్తికి సంబంధించినదైతే థైరాయిడ్ సర్జరీతో సరిచేయవచ్చు. హార్మోనల్ సమతుల్యత దెబ్బతినకపోయినా గొంతు ముందు భాగాన ఉన్నవాపుని తొలగించడానికి థైరాయిడ్ సర్జరీ చేయించాలి.
థైరాయిడ్ వాపులలో థైరాయిడ్ సర్జరీనే సరైన చికిత్స. కొన్ని మందులతోనూ తగ్గుతాయి. వాపుని బట్టి థైరాయిడ్ గ్రంథిని మొత్తంగా తీసేయాలా, కొంత భాగమే తీసేయాలా అనేది నిర్ణయిస్తారు. అడ్డంగా కోసి శస్తచ్రికిత్స చేయడంతో గాటు కనపడకుండా చేయవచ్చు. ఈ ఆధునిక వైద్యయుగంలో శస్తచ్రికిత్స వల్ల జరిగే నష్టాలు చాలా తక్కువ. గొంతు మీద శస్తచ్రికిత్స మరక పడకుండా ఉండాలని అనుకునేవాళ్ళు రోబోటిక్ సర్జరీ చేయించుకోవచ్చు. శస్తచ్రికిత్స జరిగిన రెండో రోజో, మూడో రోజో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. రోజుకి ఒక టాబ్లెట్‌ని మాత్రమే వాడాల్సి రావచ్చు. థైరాయిడ్ క్యాన్సర్‌కి శస్త్ర చికిత్స చేయించుకున్నవాళ్ళు రేడియో ఐసోటోప్ అయోడిన్ థెరపీని కూడా ఆ తరువాత తీసుకోవడం మంచిది.