సంజీవని

కీలెరిగి మంధు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీర్ఘకాలిక వ్యాధి అయిన ఆర్ధరైటిస్ శరీరంలో ఎన్నో అవయవాలను, ముఖ్యంగా కీళ్లు, చేతులు, భుజాలు, నడుము మరియు వెన్నుపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. మంచి దేహ దారుఢ్యం, ఆరోగ్యం వున్న మనిషిని కూడా ఇట్టే బలహీనపరిచే శక్తి ఆర్థరైటిస్‌కి ఉంది. నేడు 20 శాతం జనాభా ఆర్థరైటిస్ వలన బాధపడుతున్నారు.
ఆర్థరైటిస్ లో Osteoarthritis ఎక్కువగా మనకు కనపడేది. ఇది యాభై ఏళ్ళ పైబడిన వాళ్ళలో ఎక్కువగా వున్నా చిన్న వయసు వారిని కూడా బాధించగలదు. దీని తర్వాత స్థానం Rheumatoid ఆర్థరైటిస్‌కి చెందినది. ఇది రెండు శాతం జనాభాని పీడిస్తూ మోచేతుల్లో, కీళ్ళని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రోజువారీ పనులు చేసుకోవడం కూడా చాలా కష్టతరంగా మారుతుంది. తొందరగా కళ్ళు తెరిచి వైద్య చికిత్స చేయించకపోతే చేతుల్లో, మోకాళ్ళలో బలహీనతలు, వైకల్యాలు వచ్చే ప్రమాదాలు హెచ్చు.
చిన్న వయసువారిని spondio arthritis బాధిస్తుంది. దీనివలన వెన్నునొప్పితో ఉద్యోగాలు సరిగా చేసుకోలేక బాధపడేవారు ఎందరో వున్నారు. చాలా తీవ్రంగా వచ్చే spondio Arthritis వలన తుంటి కీళ్లు దెబ్బతిని ఆపరేషన్‌కు దారితీయవచ్చు. ఇందులో వైకల్యాలు తీవ్రతరమైతే ఆపరేషన్ చాలా ఖర్చుతో కూడుకున్నది అవుతుంది. స్ర్తిలలో చాలా ప్రమాదకారిగా ఉన్న ఆర్థ్ధరైటిస్‌ని Iupus గ్రహిస్తారు. కీళ్ళనొప్పులతో పాటు జుట్టు రాలిపోవడం, శరీరంమీద దద్దుర్లురావడం, అల్సర్లు మాత్రమే కాకుండా కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు దెబ్బతినే ప్రమాదం కూడా వుంది. ఇది ఆదిలోనే గుర్తించకపోతే ప్రాణనష్టానికి కూడా దారితీస్తుంది. చిన్న పిల్లల్లోని ఆర్థరైటిస్‌ని juvenile arthritis అంటారు. ఇది కూడా ప్రారంభంలో గుర్తించి చికిత్స చేయించుకోకపోతే కీళ్లలో, తుంటిలో, ఇతర భాగాలను నష్టపరిచి శాశ్వతంగా సైకల్యానికి దారితీయవచ్చు. అన్నివయసుల వారిని ప్రభావితం చేస్తున్నందువల్ల ఈ సంవత్సరం ఆర్థరైటిస్ అవగాహన వారం థీమ్ ‘అన్ని వయసులలో వ్యాధి.. అవగాహన పెంచుకోండి’గా నిర్ణయించబడింది. ఆర్ధరైటిస్ బాధితుల సంఖ్య పెరుగుతున్నది వాస్తవమైనా వయసుమీద పడుతున్నవారి జనాభా పెరుగుతున్నందువల్ల osteoarthritis కేసులు పెరుగుతున్నాయి. బరువు పెరగటం, చెడు ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవటం, ఒత్తిడితో కూడుకున్న జీవనశైలి, ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల, పొగత్రాగడం ఈ సమాజంలో ఆర్థిరిస్ కేసుల పెరుగుదలకు దోహదపడుతుంది.
అవగాహన పెంచటం, పెంచుకోవటం, ఆరంభంలోనే గుర్తించటం, చికిత్స అందించటం, ఆరోగ్యానికి, జీవనశైలికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఆర్థరైటిస్‌ని సాధ్యమైనంత వరకు నియంత్రించవచ్చు. ప్రస్తుతం చికిత్సా విధానాల్లో వస్తున్న నూతన పోకడలవల్ల వ్యాధి లక్షణాలను అయినంత మేరకు నియంత్రించగలుగుతున్నారు. కానీ ఈ పద్ధతులు అందరికీ అందుబాటులో ఉండవు. అలాగే ఆర్థిక స్థోమత కూడా అడ్డుగా ఉంటుంది. దీనివల్ల నొప్పి తగ్గించే మందులు ఇంకా ఎక్కువమంది వాడుతున్నారు.