సంజీవని

ప్రశ్న-జవాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా వయస్సు 22 సంవత్సరాలు. చిన్నప్పుడు కిందపడి ముందుపళ్లు విరిగిపోయి. అప్పటినుంచి నా పళ్లు అలానే ఉండిపోయాయి. చిన్నప్పుడు ఏమీ అనిపించలేదు. యుక్తవయస్సు వచ్చిన నాటినుంచి అందంమీద శ్రద్ధ పెరిగి పళ్ళ గురించి బాధపడుతున్నాను. ఇప్పుడు ఇవి మరీ రంగు మారి కనిపిస్తున్నాయి. మిగతా పళ్ళు అందంగానే ఉన్నాయి. దయచేసి దీని గురించి మంచి సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
-సావిత్రి, ఏలూరు
మీ సమస్య గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అదేపనిగా ఆలోచిస్తే సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. దెబ్బ మరీ గట్టిగా తగలటంవల్ల బయటకు కనిపించే క్రేన్ భాగమే కాకుండా లోపల పంటి మూలం కూడా దెబ్బతిని ఉంటుంది. పంటి మూలం భాగంలో చివరినుండి రక్తనాళాలు, నరాలు పంటిలోకి చొచ్చుకొని పంటికి కావాల్సిన రక్తాన్ని, ఆహారాన్ని సప్లయి చేయటం జరుగుతుంది. అట్లాగే నరాలు వ్యవస్థ కూడా పంటిలో ఉండి అన్ని సంకేతాలనూ మెదడుకు చేరవేస్తుంది. మీ పంటికి బలమైన గాయం తగిలినపుడు పంటిపై సప్లై చేసే నరాలు, రక్తనాళాలు కూడా తెగిపోయి ఉండవచ్చు. ఎందుకంటే, ఆరు సంవత్సరాల తర్వాత ఆ రెండు పళ్లు పసుపుగా మారాయంటే దీనికి కారణం అదే. అంటే ఆ రెండు పళ్లు (డెడ్) చనిపోయాయని భావించాలి.
అందువల్ల ఆ పళ్లలో ఉండే జీవకణాలు కుళ్లిపోవటంతో పళ్లు రెండూ పసుపుగా మారాయి. కొంతకాలానికి అవి నల్లగా మారతాయి. ఇటువంటి పళ్లను ఎక్స్‌రే తీసి పరిశీలించినట్లయితే పంటి మూలం కింద చీము కూడా ఏర్పడుతుంది. ఇలాంటి పళ్లను అశ్రద్ధ చేసినట్లయితే పళ్లకింద ఉన్న చీము ఎక్కువై పైదవడ దగ్గర వాపు వచ్చి చివరకు అది పగిలి చీము బయటికి వస్తుంది. కాబట్టి ఈ పళ్లను తీయించుకొని పళ్లు కట్టించుకోవచ్చు. అలా కాకుండా పళ్లు గట్టిగానే ఉన్నాయి. కాబట్టి రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకోవచ్చు. రూట్‌కెనాల్ అంటే ఆ రెండు పళ్లకు కిందగా రంధ్రం చేసి లోపల ఉన్న చీమును కొన్ని ప్రత్యేక పరికరాల ద్వారా తీసేస్తారు.
పంటి కెనాల్‌లోనూ, దవడ ఎముకలోనూ బ్యాక్టీరియా పూర్తిగా నాశనమైందని నిర్థారించిన తరువాత ప్రత్యేకమైన మెటీరియల్‌తో ఆ కెనాల్‌లో ఖాళీ భాగాన్ని నింపుతారు. పంటికి ఇదివరకు చేసిన రంధ్రాన్ని కూడా సీల్ చేస్తారు. దీనివల్ల పంటి ఎముకలో చీము రాదు. నొప్పి కూడా రాదు. పసుపు రంగు పళ్ళను అరగదీసి తొడుగులు వేస్తే పళ్ళు మెరిసిపోతాయి.
*