సంజీవని

చలికి ఇదీ మందు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో చలి పులి పంజా విసురుతోంది. గత వారం రోజుల నుండి కనీస ఉష్ణోగ్రతలు తగ్గిపోవటంతో ప్రజలు గజ గజలాడిపోతున్నారు. చలి నుంచి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కాలంలో వచ్చే జబ్బుల నుండి విముక్తి పొందవచ్చు.
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం అంత చల్లగా అయిపోవడంవల్ల మన శరీరంలో వచ్చే మార్పువల్ల ప్రధానంగా దగ్గు, జలుబు, ఉబ్బసం, గొంతు, చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు.
చర్మవ్యాధులు: వాతావరణంలో వచ్చే మార్పులవలన చర్మం పొడిబారినట్లు అవుతుంది. ఒంట్లో తేమ కూడా తగ్గడంతో చర్మం దురదగా మంటగా అనిపిస్తుంది. సొరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారికి శీతాకాలంలో దురద, మంట ఎక్కువగా ఉండి బాధిస్తుంటాయి.
ఆర్సెనికం ఆల్బం అనే మందు దురద, మంట ఎక్కువగా వున్నవారికి బాగా పనిచేస్తుంది. దురద పగటిపూట, అర్థరాత్రి ఎక్కువగా వున్నవారికి ఈ మందు ఆలోచించదగినది.
నైట్రోమోర్ మందు ఎగ్జిమాతో బాధపడేవారికి బాగా పనిచేస్తుంది. దురద తలలో, చేతి మడతల్లో వచ్చేవారికి ఈ మందు మంచి ఫలితాన్ని ఇస్తుంది.
గ్రాఫైటిస్ అనే మందు స్థూలకాయంతో బాధపడుతూ ఎగ్జిమా వ్యాధుల బారిన పడినవారికి తప్పక ఆలోచించదగినది. దురదతోపాటు మలబద్ధకంతో బాధపడేవారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
శీతాకాలంలో సొరియాసిస్ వున్నవారు దురద నుంచి ఉపశమనం కోసం సోరినమ్, మెజీరియమ్, సల్ఫర్, ఆర్స్‌అయోడ్, లైకోపోడియం అనే మందులను లక్షణానుసారం వాడుతూ ఉపశమనం పొందవచ్చు.
జలుబు.. ఈ సీజన్‌లో చాలామంది జలుబుతో వేధించబడుతుంటారు. ఈ వ్యాధి చలి తీవ్రతకు ఇంకా ఎక్కువగా ఉంటుంది. జలుబు అనేది అంటువ్యాధి. జలుబు చేసిన వ్యక్తి తుమ్మినపుడు సుమారు ఆరు గజాల దూరం వరకు ఉన్న వ్యక్తులకు కూడా అంటుకుంటుంది. జలుబుకు ముఖ్య కారణం వైరస్ క్రిములే. కొందరికి జలుబు దుమ్ము, ధూళి, వాసనలు, స్ప్రేలు పడనందున తేలికగా జలుబుకు గురి కావడం జరుగుతుంది.
అస్తమానం ముక్కునుండి నీరు కారడం, కోపం, చిరాకు, కళ్లు మంటలతో కూడి నీరు కారడం, తలనొప్పిగా బరువుగా అన్పించడం, శరీరం వేడిగా జ్వరంలాగా ఉండటం, గొంతులో నొప్పిగా ఉండుట లక్షణాలతో బాధపడుతుంటారు. జలుబు దీర్ఘకాలికంగా ఉండటంవలన ‘సైనసైటిస్’కు గురికావడం జరుగుతుంది.
కాలిబైక్రోమికం అనే మందు ముక్కు పైభాగంలో తీవ్రమైన నొప్పి, ముక్కు పొడి ఆరిపోయి, ముక్కునుండి చిక్కని జిగురుతో కూడిన స్రావాలు, తీగలుగా సాగుతూ ఉండేవారికి వాడుకోదగినది. ఈ మందులే కాకుండా ఆర్సినికం ఆల్బం, రస్‌టాక్స్, టుబర్కులినం, ఎల్లియం సెఫా, ఫెర్రం ఫాస్, కాలిమోర్, లేకసిస్, కాల్కేరియా కార్బ్, సల్ఫర్ వంటి కొన్ని మందులను లక్షణసముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడుకుని జలుబు బాధలనుండి ఉపశమనం పొందవచ్చు.

డా.పావుశెట్టి శ్రీధర్ 9440229646