సంజీవని

మీకు మీరే డాక్టర్ ....... కీళ్లవాతంలో విషదోషాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: కీళ్ళవాతం వ్యాధిలో ఏం తినకూడదో వివరంగా చెప్పండి. నివారణ సూచించండి సార్..
-కానుమూరి శరచ్ఛంద్రబాబు, జగిత్యాల
జ: కీళ్ళవాతంలో ఏం తినకూడదని అడిగి తెలుసుకోవటం సబబు. సాధారణంగా అందరూ తినేదే కీళ్ళవాతంతో బాధపడేవారు కూడా తింటారు. వాటిలో ఆ వ్యక్తికి సరిపడనివి ఏవో గమనించి వాటిని మానటమే చికిత్స. నొప్పులు, వాపుల్ని ప్రేరేపించే ఆహార విహారాలను ట్రిగ్గరింగ్ ప్యాక్టర్స్ అంటారు. వాటిని మానితే వ్యాధి అదుపులో వుంటుంది.
మన శరీరానికి సరిపడని ఆహార పదార్థాలను తీసుకున్నపుడు దగ్గు, జలుబు తుమ్ములు, ఉబ్బసం, దురదలు ఎలా కలుగుతాయో కీళ్ళలో నొప్పులు, వాపులు కూడా అలానే పెరుగుతాయి. కీళ్ళనొప్పుల వ్యాధిని (ఆర్ద్రయిటిస్) ఎలర్జీ వ్యాధుల కోవలోనే (ఆటో ఇమ్మ్యూన్ డిసీజెస్) ఆహార విహారాల కారణంగా పెరిగే వ్యాధిగా శాస్తవ్రేత్తలు పరిగణిస్తున్నారు.
తీసుకున్న ఆహారం సమంగా పక్వం కానపుడు దాన్ని ఆయుర్వేద శాస్త్రంలో ‘ఆమం’ అంటారు. ఈ ఆమం శరీరం అంతా వ్యాపించి ప్రముఖంగా కీళ్ళలో చేరి అక్కడ వాపుల్నీ, నొప్పుల్నీ తెస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. పర్వతాలు ఫలహారం చేయగలంత జీర్ణశక్తి ఉన్నవారికి ఎలర్జీ వ్యాధులు, కీళ్ల వాత వ్యాధులు రానే రావని దీని భావం. జీర్ణశక్తి మందంగా వున్నపుడు అది అరిగించగల దానికన్నా కఠినంగా వుండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆమ దోషం ఏర్పడి రోగాలకు ద్వారాలు తెరుస్తుంది. తేలికగా అరిగేవి తిన్న రోజున శరీరంలో తేలికగా వుంటుంది.
ఆమదోషాన్ని అశ్రద్ధ చేస్తే, అది శరీరంలోని ధాతువులు విసర్జించే మలాలతో కలిసి ఆమ విషంగా మారుతుంది. పర్యావరణంలో విషాలు, కల్తీలు కలిసిన ఆహార పదార్థాల ద్వారా చేరే విషాలతో ఈ ఆమ విషాలు కలిసి గర విషాలు (టాక్సిన్స్)గా మారతాయి. ఈ విషాలు శరీర ధర్మాలను అడ్డగిస్తాయి. శరీరాన్ని విషపూరితం చేస్తాయి. కీళ్ళను (జాయింట్లను) చెరుస్తాయి. కీళ్ళవాతం ముంచుకువచ్చి జాయింట్లన్నీ వాచిపోయి, వంగకుండా కదలకుండా బిగుసుకుపోయే దుస్థితి ఏర్పడుతుంది. ఇదంతా జఠరాగ్ని మందంగా వుండటం, కఠినమైన ఆహార పదార్థాలు తీసుకోవటంవలన మొదలయ్యింది. విషదోషాలను వెళ్లగొట్టే చికిత్స చేయకుండా నొప్పి బిళ్ళలతోనూ విటమిన్లతోనూ, కాల్షియం మాత్రలతోనూ చికిత్స సరిపోదు.
పర్యావరణ విషాల నుంచి దూరంగా వుండటం మొదటి విధి. నూనెలో వేసి నల్లగా బొగ్గు ముక్కల్లా వేయించిన పదార్థాలు విషాలే! పెనంమీద, నిప్పుమీద బాగా కాల్చిన పదార్థాలు కూడా విషాలే! వాటిని మాని తీరాలి. పిల్లలకు క్యారేజీల్లో రోజూ వేపుడు కూరలు పెట్టి పంపే తల్లులు బిడ్డలకు స్లో పాయిజన్‌లాగా విషాహారాన్ని పెట్టి పంపుతున్నారని గమనించాలి. వేపినందువలన అందులో పుట్టే విషపదార్థాల్ని ఎక్రిలమైడ్ అంటారు. ఇది కీళ్లవాతం నుండి కేన్సర్ దాకా అనేక వ్యాధులకు కారణం అవుతోంది. బేకరీ ఉత్పత్తులన్నీ అలా అధిక ఉష్ణోగ్రత దగ్గర వేగినవే! మామూలు ఇగురు కూరలకు ప్రాధాన్యతనివ్వండి. బజార్లో అమ్మేవాటికి దూరంగా వుండండి!
పొగతాగే అలవాటు, మద్యపానం కూడా జాయింట్లను దెబ్బతీస్తాయి. నిలవుండేందుకు ప్రిజర్వేటర్లు (ఆల్కహాల్, ఆమ్లాలు) కలిసిన పదార్థాలు కీళ్ళ వాతాన్ని పెంచుతాయి. చింతపండు లేదా శెనగపిండి కలిపి వండితే బీర, పొట్ల, సొర లాంటి తేలికగా అరిగే పదార్థాలు కూడా కష్టంగా అరిగేవిగా మారిపోతాయి. కష్టంగా అరిగే మాంసం లాంటి వాటిని కూడా తేలికగా అరిగేట్లుగా వండుకోగలిగితే విషదోషాలు పెరగకుండా వుంటాయి. ఇలా యుక్తిగా వండుకుంటే కీళ్ళ వాతాన్ని అదుపు చేయటం సాధ్యం అవుతుంది. అనుభవం వున్న ఆయుర్వేద వైద్యుని సంప్రదించి చికత్స పొందండి.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,

డా జి.వి.పూర్ణచందు