సంజీవని

మధుమేహంతో దంతాలకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డయాబెటిస్‌వల్ల రెటీనా దెబ్బతిని, రెటీనోపతితో చూపు దెబ్బ తినడమే కాకుండా, చిగుళ్లు, దంతాలకి కూడా చేటు జరుగుతుంది.
రక్తంలో షుగర్ ఎక్కువ అవ్వడంవల్ల తరచు చిగుళ్ళ జబ్బులు వచ్చి, చిగుళ్ళు వాయడం, రక్తం కారడం, దుర్వాసన కలగడం లాంటివి కలుగుతుంటాయి. దంతాలూ దెబ్బతిని పాడైపోతుంటాయి. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా వున్నపుడు నోటిలోని లాలాజంలో బ్యాక్టీరియా పెరిగి, చిగుళ్ళు దెబ్బతింటాయి. ధూమపానం చేసేవాళ్ళల్లో ఈ ఇబ్బంది ఇంకా ఎక్కువ. దంతవైద్యుడి దగ్గరకు వెళ్తే, డయాబెటిస్ ఉంటే ముందే చెప్పాలి. డయాబెటిస్‌తో రక్తనాళాలు దెబ్బతిని, రక్తప్రసరణ తగ్గి ఇబ్బంది పెడుతుంటుంది. చిగుళ్ళ కణజాలానికి, డయాబెటిస్‌లో రక్తప్రసరణ తగ్గి ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. డయాబెటిస్‌తో రోగ నిరోధక శక్తి తగ్గడంవల్ల నోట్లో వచ్చిన పుళ్ళు తగ్గవు. కాబట్టి డయాబెటీస్‌ని అదుపులో ఉంచుకోవాలి. ధూమపానంతో పాటు పొగాకుని నమలడం లాంటి విషయంలో కూడా దూరంగా వుండాలి.
డయాబెటిస్ అదుపులో లేకపోతే నోరు ఎండిపోతూంటుంది. దాంతో పుళ్ళు ఏర్పడుతుంటాయి. డయాబెటిస్‌తోపాటు ధూమపానం చేసే అలవాటు ఉన్నవాళ్ళకి 20 రెట్లు అధికంగా చిగుళ్ల వ్యాధులు రావచ్చు.

డా.సుధీర్
డెంటిస్ట్, సూపర్ స్పెషాలిటీ హస్పిటల్,
అమీర్‌పేట, 9885012444

డా.సుధీర్