సంజీవని

ప్రశ్న: జవాబు:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: గుండె జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయంటారా?
-ఎల్.జి (కాకినాడ)
జవాబు: కొన్ని ఇతర జబ్బులలాగా కొన్ని గుండె జబ్బులు వంశపారంపర్యంగా రావచ్చు. గుండె కవాటాల జబ్బులు.. ముఖ్యంగా మైట్రల్ వాల్వ్ జబ్బు, రక్తపోటు లాంటివి వంశపారంపర్యంగా రావచ్చు. అలాగే, కొలెస్ట్రాల్ ఎక్కువగా వుండడం కూడా వంశపారంపర్యంగా రావచ్చు. చిన్నపిల్లల్లో కూడా కరొనరీ ఆర్టెరీ జబ్బులు రావచ్చు. పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు వంశపారంపర్యంగా వచ్చేవే. పుట్టుకతో వచ్చే జబ్బులలో 5 శాతం జన్యుపరంగా వచ్చేవే.
ప్రశ్న: మద్యపానంవల్ల మంచీ చెడు రెండూ వుంటాయంటారు, నిజమేనా?
-బి.సిహెచ్. (వైజాగ్)
జవాబు: గర్భిణీ మద్యం సేవిస్తుంటే గర్బస్థ శిశువు గుండెకి అపాయం. తాగుడు అలవాటువున్న స్ర్తిల పిల్లల్లో పుట్టుకతో వచ్చే గుండెజబ్బులు ఎక్కువ. ప్రతిరోజూ అతి తక్కువ మోతాదులో తీసుకుంటే చెడు వుండదు. ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఎవరికైనా ప్రమాదమే.