సంజీవని

అద్భుత ఆవిష్కరణ.. ‘విద్యుత్ గుండె’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె జీవిత పర్యంతం నిరంతరాయంగా కొట్టుకుంటూనే వుంటుంది. కాని గుండె సంకోచించాలంటే ప్రతిసారి గుండె కొట్టుకోవడం ప్రారంభించటానికి విద్యుత్ అవసరమవుతుంది. అంటే, గుండె నిమిషానికి 60సార్లు కొట్టుకుంటే దానికి 60 విద్యుత్తు ప్రేరణలు అవసరమవుతాయి. మానవ శరీరానికి గుండె ఎంతో ప్రాముఖ్యం వున్న అవయవం కనుక ఈ విద్యుత్ ప్రేరణల జనరేటర్. ‘సైనస్‌నోడ్’ గుండె లోపలే వుంటుంది. ఇది ఎంత వేగంగా ఈ ప్రేరణలను సంధిస్తుంది అనేది మెదడు మరియు రక్త ప్రవాహంలో ఉండే ఇతర పదార్థాల నియంత్రణలో ఉంటుంది.
గుండె విద్యుత్ వ్యవస్థ
ఒకసారి ఒక విద్యుత్ ప్రేరణ సైనస్‌నోడ్ నుండి విడుదల కాగానే అది ఒక ప్రత్యేక ప్రసార వ్యవస్థ ద్వారా వేగంగా గుండె కండరమంతటికీ ప్రసారమవుతుంది. అందువల్ల అది విద్యుత్ జనరేటర్ మరియు పంపిణీ వ్యవస్థలాగే పనిచేస్తుంది.
గుండెలో రక్తంతో నిండిన నాలుగు గదులు ఉంటాయి. పైన ఉండే రెండు గదులు క్రింది రెండు గదుల్లోకి రక్తాన్ని విడుదల చేస్తాయి. అప్పుడే క్రింది గదులు సంకోచించి ఊపిరితిత్తుల్లోకి, అక్కడనుండి మిగతా శరీరమంతటికీ రక్తాన్ని ప్రసారం చేస్తాయి. సమయానుసారం ఈ ప్రక్రియ సక్రమంగా జరగటానికి ‘ఏట్రియో వెంట్రిక్యులర్ నోడ్’ (ఎ.వి.నోడ్) అనే భాగంపై గదుల నుండి క్రింది గదులకు విద్యుత్‌ను నెమ్మదిగా సరఫరా చేస్తుంది. ఎ.వి.నోడ్ విద్యుత్‌ను క్రింది గదుల కండరాలకు రెండు విద్యుత్ తీగల సముదాయం లేక కట్ట, కుడివైపు కట్ట (కుడివైపున), ఎడమవైపు కట్ట (ఎడమ వైపున) ద్వారా ప్రసారం చేస్తుంది.
సైనస్‌నోడ్ లేక ప్రసార వ్యవస్థకు సంబంధించిన వ్యాధుల కారణంగా గుండె తక్కువ వేగంతో లేక విరామాలతో కొట్టుకుంటుంది. గుండెకు విద్యుత్ సరఫరా ఉండనంతసేపూ గుండె కొట్టుకోదు. గుండె 5 నుండి 10 నిమిషాలసేపు కొట్టుకోకపోతే మెదడుకు రక్తప్రసరణ లోపించడంవలన ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోతాడు. వయసు పెరుగుతున్నకొద్దీ సైనస్ నోడ్ వ్యాధులు రావడం సాధారణం. దీనిని ‘సిక్ సైనస్ సిండ్రోమ్’ అని అంటారు. సైనస్ నోడ్ వ్యాధి పుట్టుక నుండి ఉండొచ్చు లేక ఆ తరువాత వచ్చి హార్ట్ బ్లాక్‌కి దారి తియ్యొచ్చు (దీని అర్థం ఎ.వి.నోడ్ దగ్గర విద్యుత్ ప్రసారం ఆగిందని). కుడి, ఎడమ, రెండు విద్యుత్ కట్టలలో విద్యుత్ ప్రసారం ఆగడంవలన కూడా హార్ట్ బ్లాక్ రావచ్చు. హార్ట్‌ఎటాక్ వచ్చాక అడ్డుపడి మూసుకుపోయిన ధమని ద్వారా రక్తప్రసారం అందే కండరం మరియు విద్యుత్ కట్టలు శాశ్వతంగా దెబ్బతినడంవలన ఇలా జరగొచ్చు.
ఈ వ్యాధుల లక్షణాలు- అకస్మాత్తుగా కళ్ళు బయర్లు కమ్మడం, క్రింద పడిపోడం- ‘సింకొపి’. ఇ.సి.జి ద్వారా లేక ‘హోల్డర్’ అనబడే 24 గంటల ఇ.సి.జి ద్వారా వ్యాధిని నిర్థారించవచ్చు. ఐతే విద్యుత్ ప్రసారంలో అంతరాయం మధ్య మధ్యలో జరగడంవలన లక్షణాలు ఉన్నపుడే గుర్తించడానికి వీలవుతుంది. ‘ఇవెంట్ మానిటర్స్’ అనే పరికరాలను తనకు వ్యాధి లక్షణాలు వచ్చినపుడు రోగి తనే ప్రేరేరపించడం ద్వారా లక్షణాలు ఉన్నపుడు మిషన్ ఇ.సి.జి.ని నమోదు చేస్తుంది. అందువలన గుండె విద్యుత్ వ్యవస్థకు సంబంధించిన పరీక్షలన్నిటికి మూలం ఇ.సి.జి. పరీక్ష.
విద్యుత్ ప్రేరణల ఉత్పత్తిని లేక విద్యుత్ సరఫరాకు అంతరాయం లేక విద్యుత్ సరఫరాను ఆపుజేసే వ్యాధులకు చికిత్స- ‘పేస్‌మేకర్’ను అమర్చడం. పేస్ మేకర్ విద్యుత్ వలయం ఉన్న బ్యాటరీ. దానిని ఛాతి చర్మం క్రింద అమరుస్తారు. సిరల ద్వారా జనరేటర్‌నుండి గుండె కుడివైపుకు విద్యుత్ తీగతో అనుసంధానిస్తారు. ఇది చాలా చిన్న ఆపరేషన్. అదే రోజున రోగిని ఇంటికి పంపేయవచ్చు. ఈ విద్యుత్ వలయం గుండె విద్యుత్ స్పందనలను కనిపెట్టి ఎపుడో లోపం వుండే అప్పుడు గుండె కండరానికి విద్యుత్ ప్రేరణల్ని పంపి అది కొట్టుకునేలాగా చేస్తుంది. సుమారు 10 సంవత్సరాల తర్వాత బ్యాటరీని మార్చవలసి వస్తుంది.
బైవెంట్రిక్యులర్ పేస్‌మేకర్
గత 15 సంవత్సరాలుగా గుండె రక్తాన్ని విడుదల చేసే సామర్థ్యాన్ని పెంచే పేస్ మేకర్స్‌ని అభివృద్ది చేస్తారు. కొంతమందికి గుండె క్రింది గదులకు విద్యుత్ ప్రేరణల్ని పంపే ఎడమ వైపు కట్టలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుంది. దీనిని లెఫ్ట్ బండిల్ బ్రాంచ్ బ్లాక్ లేక సంక్షిప్తంగా ఎల్.బి.బి.బి అంటారు. ఇపుడు విద్యుత్ కండరాల పోగుల ద్వారా కుడి కట్టనుండి ఎడమ వైపుకు నెమ్మదిగా ప్రసారమవుతుంది. (ప్రత్యేకమైన విద్యుత్ కట్టల ద్వారా వేగవంతమైన ప్రసారానికి విరుద్ధంగా) ఎడమవైపు ఆలస్యంగా ప్రేరేపించబడిన కారణంగా ఆ భాగం కుడివైపు సంకోచించడం ఆగిపోయాక సంకోచించడం ప్రారంభిస్తుంది. ఇది ఒక కేంద్ర బిందువు చుట్టూ ఏకకాలమందు ఒక సమన్వయంతో సంకోచించకుండా, రక్తం బయటికి విడుదలవకుండా ఎక్కడిదక్కడే సుళ్ళు తిరుగుతుంది. ఇది గుండె రక్తాన్ని బయటకి పంప్ చేసే సామర్థ్యాన్ని లేక గుండె ఇజెక్షన్ ఫ్రాక్షన్ (ఇ.ఎఫ్)ని తగ్గిస్తుంది. ఆలస్యంగా ప్రేరేంపబడే గుండె భాగానికి త్వరగా ప్రేరేపణల్ని పంపడానికి ఇపుడు పేస్‌మేకర్స్ లభ్యమవుతున్నాయి. ఆయాసంతో బాధపడే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు (ఇ.ఎఫ్. తక్కువ ఉన్నవారు). వారి ఇసిజిలో గనుక ఎల్‌బిబిబి ఉంటే, పేస్‌మేకర్‌ని అమరిస్తే వారి గుండె పనితీరులో గణనీయంగా మెరుగుదల కనిపిస్తుంది.
గుండె రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యాన్ని తగ్గించి, తద్వారా గుండె గదుల్లోని ఒత్తిడిని పెంచే పరిస్థితిని ‘హార్ట్ ఫెయిల్యూర్’ అని అంటారు. ఇది ఊపిరితిత్తుల్లో రక్తం నిలిచిపోయే స్థితికి, దానివల్ల ఆయాసం, కాళ్ళవాపు రావడానికి దారితీస్తుంది. దీనికి సర్వసాధారణ కారణం శాశ్వతంగా గుండె కండరంలో ఒక భాగాన్ని దెబ్బతినేలా చేసే ‘హార్ట్ ఎటాక్’. ప్రత్యేక విద్యుత్ సరఫరా వ్యవస్థ గుండె కండరమంతటా ఉంటుంది. కనుక అది కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె విద్యుత్ వలయాల్లో షార్ట్ సర్క్యూట్‌కి దారితీస్తుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడినపుడు ఏ విధంగా ఎలక్ట్రిక్ బల్బ్ అటు ఇటు చలిస్తూ కొట్టుకుంటుందో అదేవిధంగా ఈ షార్ట్ సర్క్యూట్ వలన గుండె నిమిషానికి కొన్ని వందల సార్లు కొట్టుకునేలా ప్రేరేపించబడుతుంది. దీనిని ‘వెంట్రిక్యులర్ టాఖీకార్డియా’ లేక ‘్ఫబ్రలేషన్’ అని అంటారు. ఒక క్రిముల సంచి ఏ విధంగా కంపిస్తుందో అదేవిధంగా గుండె కంపిస్తుంది. బయటినుంచి బలమైన విద్యుత్ షాక్ ద్వారా ఈ షార్ట్ సర్క్యూట్‌ని ఛేదించకపోతే కొద్ది నిమిషాల్లోపే గుండె కొట్టుకోవడం ఆగిపోయి హఠాత్తు మరణానికి దారితీస్తుంది. తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ వున్న మూడింట రెండు వంతులమంది రోగులు హఠాత్తుగా ఫిబ్రలేషన్ వలన మరణిస్తారు.
‘మీనియేచర్ డీఫిబ్రలేటర్ (ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డివెర్డర్ డీఫిబ్రిలేటర్, సంక్షిప్తంగా ఎఐసిడి)తో పేస్‌మేకర్‌ని అమర్చిన విధంగానే ఛాతీ చర్మం క్రింద అమర్చి దీనికి చికిత్స చేయ్యొచ్చు. ఇది గుండె లయగా కొట్టుకునే ప్రక్రియను పర్యవేక్షిస్తూ ఎపుడు గుండె వేగం పెరుగుతుందో అపుడు షార్ట్ సర్క్యూట్ వలయాన్ని తాత్కాలికంగా ఛేదించడానికి లోపలే ఒక షాక్‌ని ఇస్తుంది. అందువలన ఇది నిజమైన జీవిత బీమా పథకం. ఈ పథకాన్ని తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగులందరికీ సిఫారసు చెయ్యొచ్చు.
నార్మల్ మరియు పెద్దదైన గుండె
ఫిబ్రలేషన్‌లో వున్న గుండె మరియు ఎ.ఐ.సి.డితో షాక్
హార్ట్‌ఎటాక్‌వలన జరిగే మరణాల్లో 50 శాతం, రోగి హాస్పిటల్‌కి చేరేలోగానే మొదటి గంటల్లోనే జరుగుతాయి. ఈ మరణాలకు కారణం మళ్లీ వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషనే. ఆటోమేటిక్ ఎక్స్‌ర్నల్ డీఫిబ్రిలేటర్ (ఎ.ఇ.డి) యొక్క మెత్తటి పెడిల్స్‌ని హార్ట్ ఎటాక్‌తో బాధపడుతున్న రోగి ఛాతికి తగిలించడం ద్వారా హాస్పిటల్‌కి చేరేలోగా జరిగే మరణాల్ని నివారించవచ్చు. అదేవిధంగా స్పృహ తప్పి క్రింద పడిపోయే వ్యక్తుల్ని కూడా రక్షించవచ్చు. ఎ.ఇ.డి గుండె లయను గుర్తిస్తూ గుండె అతివేగంగా కంపిస్తున్నపుడు పైకి వినపడేలాగా అలారం మ్రోగిస్తుంది. ఎవరైనా బటన్‌ని నొక్కితే ఫిబ్రిలేషన్ షార్ట్ సర్క్యూట్‌ని ఛేదిస్తూ ఒక షాక్‌ని ఇస్తుంది. ఐతే చిట్టచివరి చికిత్స సాధ్యమైనంత త్వరగా ఏంజియోప్లాస్టీ చేసి హార్ట్ ఫెయిల్యూర్‌కి కారణమైన రక్తనాళంలోని అడ్డును తొలగించడమే. ప్రతి పబ్లిక్ ప్రదేశంలోనూ, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, క్లబ్ హౌసెస్, జిమ్స్, రైల్వే మరియు బస్‌స్టేషన్స్, ఎయిర్‌పోర్ట్స్ మొదలగు వాటిల్లో ఈ ఎ.ఇ.డిల్ని ఉంచడం తప్పనిసరి.

-డా.వి.ఎస్.రామచంద్ర
చీఫ్ కార్డియాలజిస్ట్, శ్రీశ్రీ హోలిస్టిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
నిజాంపేట రోడ్, హైదరాబాద్-500 072... 99490 33315

-డా.వి.ఎస్.రామచంద్ర