సంజీవని

‘గుండెదడ’కు శస్తచ్రికిత్సతో చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె వేగాన్ని పెంచడం కారణంగా రోగికి గుండె దడ వస్తుంది. తల తిరగడం ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇలా గుండె దడ వచ్చినపుడు ఇసిజి తీస్తే వీటిని గుర్తించవచ్చు. కాలి సిరల ద్వారా ఇసిజి లీడ్స్‌లాగా పనిచేసే అనేక చిన్న వైరుల్ని గుండెలో అమర్చి చేసే సులభమైన పరీక్షను ఎలక్ట్ఫ్రోజియాలజీ స్టడీ (ఇ.పి.ఎస్) అంటారు. షార్ట్ సర్క్యూట్స్‌ని చేసి అధ్యయనం చెయ్యొచ్చు. చాలా కేసుల్లో ఒకే ఒక షార్ట్ సర్క్యూట్ వుంటుంది. ఆ ప్రదేశానికి రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీని పంపడం ద్వారా ఆ షార్ట్ సర్క్యూట్‌ని శాశ్వతంగా నాశనం చెయ్యొచ్చు. దీనిని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని అంటారు. ప్రస్తుతం ఇది వైద్య శాస్త్రంలో అందుబాటులో వున్న అత్యంత సమర్థవంతమైన చికిత్స. దీనిని నొప్పి లేకుండా చెయ్యొచ్చు. ఈ చికిత్స ద్వారా శాశ్వతంగా రోగ నివారణ జరుగుతుంది. ఆ తరువాత మందులు వాడవలసిన పనిగాని, తిరిగి మళ్లీ పరీక్షలకు రావలసిన అవసరం గాని వుండదు.
ఫ్లట్టర్ అబ్లేషన్ లైన్
గుండె వ్యాధుల కారణంగా మరణించడం వంశపారంపర్యంగా రావచ్చు. కొంతమందికి గుండె కండరం మందంగా అవుతుంది. దీనిని హైపర్ ట్రోఫిక్ కార్డియో మయోపతీ అని అంటారు. దీనిని సాధారణ ఇఖోకార్డియోగ్రఫి పరీక్ష ద్వారా (గుండెకు అల్ట్రాసౌండ్ పరీక్ష) సులభంగా గుర్తించవచ్చు. బ్రుగడా మరియు లాంగ్ క్యు టి సిండ్రోమ్స్‌ని ఇసిజిల ద్వారా గుర్తించవచ్చు. మీ రక్త బంధువు ఎవరైనా హఠాత్తుగా మరణిస్తే లేక ఛాతి నొప్పి లేకుండా పడిపోయి మరణిస్తే మీరు కార్డియాక్ రిధమ్ నిపుణుడిని కలిసి పరీక్ష చేయించుకుని వంశపారంపర్య అంశం వుందో లేదో తెలుసుకోవాలి. యువతలో చాలామంది ఎ.ఐ.సి.డితో చాలా లాభపడతారు.
సింకొపి (స్పృహ కోల్పోవడం) అంటే తెలివి లేకుండా పడిపోయి మళ్లీ వెంటనే తెలివి రావడం. ప్రమాదకరమైన గుండె విద్యుత్ వ్యవస్థ సమస్యకు ఇది ప్రారంభ లక్షణం కనుక వెంటనే రిథమ్ నిపుణుడితో పరీక్ష చేయించుకోవాలి. కుటుంబ చరిత్ర, ఇసిజి ఎలక్ట్రోకార్డియోగ్రామ్ మరియు ఒక్కోసారి జెనెటిక్ విశే్లషణను నిశితంగా చెయ్యడం ద్వారా ప్రమాదకరమైన కారణాలు లేవని నిర్థారించవచ్చు. సింకొపికి చాలా తరచుగా కనిపించే కారణం వాసలోవాగల్. మానసికంగా స్థిమితం లేని పరిస్థితుల్లో ఉన్నపుడు ఇది వస్తుంది. ఇది అంత ప్రమాదకరం కాదు. జాగ్రత్తగా ఆ వ్యక్తివ్యాధి చరిత్రను తెలుసుకుని టిల్ట్ టేబుల్ టెస్ట్‌ని చెయ్యడం ద్వారా నిర్థారించవచ్చు. ఈ పరీక్షలో తాత్కాలికంగా వారి బెడ్‌ని నిలువుగా వంచి అపుడు జరిగే మార్పుల్ని గమనించవచ్చు. సులభమైన వ్యాయామాలు, కాలికి స్టాకింగ్స్ వేసుకోవడం ద్వారా చాలాసార్లు ఈ సింకొపిని నివారించవచ్చు.
గుండెలో 4 భాగాలున్నాయి.
గుండె కండరం- ఇది నిరంతరం పని చెయ్యడానికి రక్తం కావాలి. ప్రతిసారి గుండె సంకోచించడానికి విద్యుత్ ప్రేరణలు కావాలి. గుండె కండరం దెబ్బతింటే గుండె యొక్క రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం తగ్గి హార్ట్‌ఫెయిల్యూర్‌కి దారితీస్తుంది. అధిక రక్తపోటు, స్థూలకాయానికి చికిత్స చెయ్యడం, హార్ట్ ఎటాక్స్‌ని నివారించడం ద్వారా హార్ట్ ఫెయిల్యూర్ రాకుండా కాపాడుకోవచ్చు.
గుండెకు రక్తం 3 ధమనుల ద్వారా సరఫరా అవుతుంది. వీటి వ్యాసార్థం ఒక బాల్‌పాయింట్ పెన్ రీఫిల్ అంత ఉంటుంది. వీటిలోపల కొలెస్ట్రాల్ పేరుకుపోయి అక్కడ రక్తం గడ్డకట్టవచ్చు. దీనితో రక్తనాళం సరఫరా చేసే గుండె కండరం శాశ్వతంగా దెబ్బతింటుంది. దీనినే హార్ట్ ఎటాక్ అని అంటారు.
మరణాలకు (హఠాత్తుగా జరిగేవి మరియు తరువాత జరిగేవి రెండూ) హార్ట్ ఫెయిల్యూర్స్‌కి కారణమైన హార్ట్ ఎటాక్స్‌ని సులభంగా నివారించవచ్చు.
గుండె వాల్వ్వ్ రక్తాన్ని ఒకవైపు ప్రవహించేందుకు మాత్రమే అనుమతిస్తాయి. అవి గుండె గదుల మధ్య తలుపులలాంటివి. చిన్న పిల్లల్లో గొంతు ఇన్‌ఫెక్షన్లు తరువాత వచ్చే రుమాటిక్ హార్ట్ డిసీజ్ వలన ఇవి దెబ్బతినవచ్చు. పోషకాహారాన్ని తగినంత ఇవ్వడం, పరిశుభ్రతను పాటించడం, గుంపుల్లో క్రిక్కిరిసి నివసించకుండా వుండడం, గొంతు ఇన్‌ఫెక్షన్లకు సరిగ్గా చికిత్స చెయ్యడం ద్వారా దీనిని నివారించవచ్చు.
గుండె విద్యుత్ వ్యవస్థ చాలా కీలకమైనది. ఇది సామాన్యంగా విఫలమవదు. హార్ట్‌ఎటాక్ తరువాత మొదటి కొన్ని గంటల్లోనూ, హార్ట్ ఫెయిల్యూర్స్ తరువాత కొంత కాలానికి వచ్చే షార్ట్ సర్క్యూట్స్‌వలన సాధారణంగా మరణిస్తారు. వీటిని సులభంగా నివారించవచ్చు.
ఎ.ఐ.డిని ఎ.ఐ.సి.డిని ఉపయోగించుకోగలిగేంత స్థాయిలో వినియోగించుకోవడం లేదు. హఠాత్తు మరణాలకు, సింకొపికి ఉండే వంశపారంపర్య కారణాల్ని గుర్తించడానికి నిపుణులతో పరీక్షలు చేయించుకోవాలి. గుండె దడను, గుండె అతివేగంగా కొట్టుకోవడాన్ని అబ్లేషన్ చికిత్స ద్వారా పూర్తిగా నయం చెయ్యవచ్చు.

-డా.వి.ఎస్.రామచంద్ర
చీఫ్ కార్డియాలజిస్ట్, శ్రీశ్రీ హోలిస్టిక్
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
నిజాంపేట రోడ్, హైదరాబాద్-500 072... 99490 33315

-డా.వి.ఎస్.రామచంద్ర