సంజీవని

జ్ఞాపకశక్తి తగ్గితే.. ఇదీ మందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాపకశక్తి అనేది మన నిత్య జీవితంలో ప్రతి పనికి అవసరం. ఇది లోపిస్తే ప్రతి పనికి అంతరాయం. ఏదైనా విషయం గుర్తుంచుకున్నపుడు వెంటనే గుర్తుకురాకపోవడాన్ని జ్ఞాపశక్తి లోపంగా వ్యవహరిస్తారు. మనం పుట్టినప్పటినుంచి చనిపోయేంతవరకు జరిగే సంఘటనలు మెదడులోని న్యూరాన్లలో నిక్షిప్తమై ఉంటాయి. అవసరమైనప్పుడు ఆ విషయాన్ని బయటకు వెంటనే తేవడమే జ్ఞాపకశక్తి.
కారణాలు
సరియైన పోషక ఆహారం తీసుకోకపోవడం
మెదడులో కణుతులు ఏర్పడటంవల్ల మెదడుకు సోకే ఇన్స్‌ఫెక్షన్స్ వలన
థయామిన్ లోపంవలన
మెదడుకు ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ సరిగా అందని పరిస్థితుల్లో
తలకు బలమైన గాయాలు తాకడంవలన
కొన్ని రకాల మత్తు పదార్థాలను అధికంగా వాడటంవలన (ఆల్కహాలు వంటివి)
థైరాయిడ్ లోపం
మానసికంగా ఒత్తిడికి అధికంగా గురికావడం
లక్షణాలు
సరియైన సమయంలో చదివింది గుర్తుకురాకపోవడం
వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకురాకపోవటం
కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం
కొంతమంది గృహిణులు బజారుకు వెళ్లిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్ ఆఫ్ చేసామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.
ఇటువంటి లక్షణాలు ఉన్నపుడు తమకు జ్ఞాపకశక్తి లోపించిందేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పనిమీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయటం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం వలన మానసిక ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి’ మెరుగుపడుతుంది.
చికిత్స
హోమియోలో జ్ఞాపకశక్తి లోపాన్ని నివారించటానికి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ మందులను ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక, శారీరక అలవాట్లను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞాపకశక్తి లోపానికి గల కారణాలైన భయం, మానసిక ఒత్తిడి, నెగెటివ్ ఆలోచనలు ఉంటే వాటినుండి బయటపడేందుకు కౌన్సిలింగ్ ఇప్పించాలి.
మందులు: ఎనకార్డియం- జ్ఞాపకశక్తి లోపానికి ఈ మందు బాగా పనిచేస్తుంది. పిల్లలు చదివింది పరీక్షలకు ముందు గుర్తుకురాక బాధపడుతుంటారు. ఇటువంటివారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
బైరైటా కార్బ్
ముసలివారు మరియు ఎక్కువ బలహీనంగా ఉన్నవారు మతిమరుపుతో బాధపడుతుంటారు. వీరికి మానసిక వికాసం తక్కువ. అలాగే జ్ఞాపకశక్తి లోపంతోపాటు పిల్లలలో ఎదుగుదల లోపించి మరుగుజ్జుగా ఉన్నట్లు అయితే ఈ మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
సల్ఫర్: వీరు పేర్లను మరచితారు. వీరికి మానసిక శక్తి తక్కువ, బద్ధకస్తులు. వీరు మతిమరుపుతోపాటు, చర్మవ్యాధి, మలబద్ధకంతో బాధపడుతుంటారు. వీరికి పరిశుభ్రతపై పట్టింపు ఉండదు. అపరిశుభ్రంగా ఉంటారు. వీరు చూడటానికి సన్నగా ఉంటారు. కుదురుగా ఒక చోట నిలబడలేరు. వంగి నడుస్తుంటారు. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఎకోనైట్: వీరు తేదీలను మరిచిపోతారు. మానసిక ఒత్తిడివల్ల జ్ఞాపకశక్తి తగ్గినట్లు అయితే ఆరంభ దశలో ఈ మందు బాగా పనిచేస్తుంది. అలాగే వీరు చల్లగాలిలో తిరగడం వలన ముక్కు బిగుసుకొనిపోయి, తుమ్ములు, గొంతునొప్పి వెంటనే ప్రారంభమవుతుంది. వీరికి ఆందోళన, దాహం విపరీతంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి జ్ఞాపకశక్తి లోపంతో బాధపడేవారికి ఈ మందు ఆలోచించదగినది.
సిక్యుట విరోస: వీరు మందమతులు. వీరు పేరును సైతం మరిచిపోతారు. చివరకు తమ ఇంటి నెంబరును, ఫోను నెంబరును కూడా మరిచిపోతారు. ఇలాంటివారికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
ఈ మందులే కాకుండా ఎతూజ, ఎసిటిక్ ఆసిడ్, స్ట్ఫాసాగ్రియా, కాల్కేరియా ఫాస్, కాలిఫాస్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

డా.పావుశెట్టి శ్రీధర్.. 9440229646