సంజీవని

మీకు మీరే డాక్టర్... గురకను తగ్గించుకునే ఉపాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డి.రాజారావు, ఖమ్మం
సాధారణంగా ప్రతీ మనిషీ అంతో ఇంతో గురకపెడతాడు. అది శృతిమించిన రాగాన పడితే ఇంటిల్లిపాదికీ నిద్రాభంగం అవుతుంది. గురకపెట్టేవారికీ గురక నిద్రాభంగమే! నిద్ర చాలకపోవటంవలన మర్నాడు అలసట, నిస్సత్తువ కలుగుతాయి. అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. గదిలో ఒక్కడే తలుపులు మూసుకుని పడుకున్నందువలన ఇంట్లో వాళ్లకు గురక బాధ తప్పవచ్చేమోగాని, గురకపెట్టేవారికి ఒరిగేదేమీ లేదు.
గొంతులోంచి ముక్కు ద్వారా గాలి రాకపోకలు సరిగా నడవనపుడు ఆ పరిసరాల్లోని కండరాల్లో అధిక సంచలనాలు (వైబ్రేషన్లు) కలుగుతాయి. ఒక్కోసారి ఊపిరి అవరోధం కూడా జరగవచ్చు. ఊపిరాడకపోవటంవలన రోగి చాలా అవస్థపడతాడు. అది ప్రమాదానికి దారితీయవచ్చు కూడా! మామూలు గురక వలన జరిగే నిద్రాభంగం కన్నా ఊపిరాడకపోవటం వలన కలిగే నిద్రాభంగం అపాయకరం కదా!
స్థూలకాయం, మధ్యవయసు, శరీర నిర్మాణంలో తేడాలు, పడుకునే తీరు, ముక్కు, గొంతులకు సంబంధించిన సమస్యలు, మద్యపానం, ధూమపానం- ఇలాంటి కారణాలు గురకను తీసుకురావచ్చు. నూనె పదార్థాలు, శనగపిండి, బఠాణీ పిండితో చేసిన వంటకాలు, బాగా ముదిరిన కొబ్బరి వేసి తయారుచేసిన వంటకాలు, అతిగా పులుపు రుచి కలిగిన పదార్థాలు తినేవాళ్లకు గురక ఎక్కువగా ఉంటుంది. అజీర్తి కూడా బహుశా గురక వ్యాధిలో ఒక కారణం కావచ్చు. గురక పెట్టేవారి ఆహార విహారాల గురించి బాగా అధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి.
నోరు తెరచి గురక పెట్టేవారిలో గొంతు కండరాల తేడాలు గురకకు కారణవౌతాయి. నోరు మూసుకునే గురకపెట్టేవారిలో నాలుక సమస్య కారణం కావచ్చు. కొందరిలో వెల్లకిలా పడుకున్నపుడు గురక తీవ్రత కొంచెం తక్కువగా వుండవచ్చు. ఆయా కారణాలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది.
వ్యాయామం, శరీర శ్రమలు కొంతవరకూ గురక తగ్గడానికి సహకరిస్తాయి. వేళకు నిద్రపోవటం, రాత్రి జాగరణలు మానేసి తెల్లవారు జామున లేవటం అలవాటు చేసుకుంటే ఈ వ్యాధిలో మంచిది. ముక్కు దిబ్బడ లేకుండా చూసుకోవటం, ఆవిరి పట్టడం, జలుబుని తెచ్చే ఆహార విహారాలను మార్పు చేసుకోవటం, పడక గదిలో చెమ్మ లేకుండా జాగ్రత్తపడటం ఇవన్నీ గురక తగ్గేందుకు అవసరమైన జాగ్రత్తలు.
ఎడమవైపు తిరిగి పడుకుంటే గురక తగ్గటాన్ని చాలామంది విషయంలో శాస్తవ్రేత్తలు గమనించారు. ‘అ’ నుండి ‘అం, అః’ వరకూ అచ్చులు లేదా ‘్ఘళజయఖ’ ఓవెల్స్‌ని బిగ్గరగా అరిచినట్టు పలకటం ప్రాక్టీస్ చేయండి. నమ్మకం ఉన్నవారు విష్ణుసహస్రనామమో, లలితా సహస్రనామమో బిగ్గరగా చదవండి. గొంతు కండరాలు సాగి గురక తగ్గుతుంది. నాలుకను చాపటం ముడవటం లాంటి వ్యాయామాలవలన నాలుక కండరాలు సాగి గురక తగ్గుతుంది. పెదాలను గట్టిగా మూసి బుగ్గల నిండా గాలి నింపి అర నిమిషం సేపు బాగా ఆడిస్తే ముఖ కండరాలకూ మంచి వ్యాయామం కలిగి గురక నివారణ అవుతుంది. ప్రాణాయామం, ఎక్కువసేపు గాలి పీల్చి ఎక్కువ సేపు వదలటం వలన గురక తగ్గేందుకు అవకాశం వుంది. ‘ఊపిరి వ్యాయామాలు’ (బ్రీత్ ఎక్స్‌ర్‌సైజెస్) యోగ గురువుల దగ్గర నేర్చుకుని ఆచరిస్తే మేలు. ఊపిరి నడిచే నాళాలలో అవరోధం, ఊపిరి నడిచే దారి సన్నబడటం లాంటివి గురకకు కారణలౌతున్నాయేమో ముక్కు, చెవి, గొంతు వైద్యునితో పరీక్ష చేయించుకోండి. ఒక్కోసారి ఆపరేషన్ కూడా అవసరం కావచ్చు. గొంతు కండరాల్లో సన్నదనం అనేది కుటుంబంలో ఉండటంవలన గురక వంశపారంపర్యంగా రావచ్చు. ఎలెర్జీ వ్యాధులైన ఆస్తమా, దగ్గు, జలుబు, తుమ్ములూ కూడా గురకకు కారణం కావచ్చు. చాలామందిలో స్థూలకాయమే ప్రధాన కారణం. మందపాటి తలగడ పెట్టుకుని పడుకున్నా గురక తగ్గవచ్చు. స్థూలాంతక రసం, శిలాజిత్యాది యోగం, మేదోహర విడంగాది లోహం ఈ సమస్యను తగ్గిస్తాయి.

డా జి.వి.పూర్ణచందు,
సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట,
పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642,
purnachandgv@gmail.com

డా జి.వి.పూర్ణచందు