సంజీవని

రక్త సరఫరాలో ఆటంకం... అనర్థం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తనాళాలలో అడ్డంకులనగానే మనకు ‘ఆర్టిరియో స్ల్కీరోసిస్, ఎథిరోస్ల్కీరోసిస్’ గుర్తుకొస్తాయి. ఆర్టెరీ గోడలు మందమై వచ్చే ఇబ్బందిని ‘ఆర్టిరియో స్ల్కీరోసిస్’ అంటారు. వయసు పెరిగే కొద్దీ ఆర్టెరీల లోపలి గోడలపై కొవ్వు కణాలు చేరుకుని, రక్తనాళంలో రక్త ప్రవాహ మార్గం సన్నబడడాన్ని ‘ఎథిరోస్ల్కీరోసిస్’ అంటారు.
ఏ రక్తనాళంలో అయినా క్రొవ్వు పేరుకుపోయి రక్త ప్రవాహం మందగిస్తుంటే ఆ తర్వాతి కణజాలానికి ఆక్సిజన్, ఆహారం సరిగ్గా దొరకక ఇబ్బంది కలుగుతుంటుంది. అలా మూసుకుపోయేది ఏ అవయవానికి రక్తం సరఫరా నాళమైతే ఆ అవయవం దెబ్బతింటుంది. గుండెకి రక్తం సరఫరా చేసే ఆర్టెరీ శాఖలలో అడ్డంకులేర్పడి గుండె కండరాలకు రక్త ప్రసరణ తగ్గి గుండెపోటు రావచ్చు. క్రమంగా గుండె ఫెయిల్యూర్ రావచ్చు. గొంతుకి అటు ఇటు ఉండే కరోటిడ్ ఆర్టెరీ శాఖలలో అడ్డంకులేర్పడితే మెదడుకి రక్తప్రసరణ తగ్గి బ్రెయిన్ ఎటాక్.. పక్షవాతం రావచ్చు. కిడ్నీకి రక్తం సరఫరా చేసే నాళంలో అడ్డంకులేర్పడితే, కిడ్నీకి ఆక్సిజన్ అందక పనితీరు దెబ్బతింటుంది. ఇలా ఏ అవయవానికి రక్తప్రసరణ దెబ్బతింటే ఆ అవయవ పనితీరు దెబ్బతింటుంది.
గుండె మెదడులాంటి అవయవాల కణాలు దెబ్బతింటే మళ్లీ పునరుత్పత్తి కావు. అందుకని ఆ అవయవాలకు కలిగే నష్టం శాశ్వతమైనది.
ఎథిరోస్ల్కీరోసిస్‌వల్ల ‘ఎన్యూరిజమ్స్’ కూడా ఏర్పడతాయి. ఆర్టరీ రక్తనాళాల గోడలు ఉబ్బడంవల్ల రక్తనాళాలు ఉబ్బడాన్ని ‘ఎన్యూరిజమ్’ అంటారు. ఎన్యూరిజమ్ చాలా ఇబ్బందికర సమస్య. రక్తనాళాల గోడలు నీరసించడంతో ఆ ప్రాంతంలో ఉబ్బెత్తు కలుగుతుంటాయి, ఉబ్బిన బెలూన్‌లా. అలా బెలూన్‌లోకి గాలి పంపడంవల్ల బెలూన్ పెద్దదై పెద్దదై ఆఖరికి పగిలిపోతుంది. ఎన్యూరిజమ్‌లు కలిగిన రక్తనాళాల పరిస్థితీ అంతే! క్రమంగా ఆ ఉబ్బు పెరిగి రక్తనాళాలు పగిలిపోతాయ్.
గుండె ఎడమ వెంట్రికల్‌నుంచి బయటకు వచ్చిన రక్తం, శరీర క్రింది భాగాలకు ‘అయోర్టా’ అనే పెద్ద రక్తనాళం, దాని శాఖల ద్వారా చేరుతుంటుంది. ఈ అయోర్టాలో ‘అన్యూరిజమ్స్’ ఎక్కువగా వస్తుంటాయి. అయోర్టాలో అన్యూరిజమ్స్, ఎథిరోస్ల్కీరోసిస్‌వల్లే కాకుండా దెబ్బతినడంవల్ల, ఇన్‌ఫెక్షన్స్‌వల్ల కూడా కలుగవచ్చు. అధిక రక్తపోటువల్ల ప్రధానంగా అన్యూరిజమ్స్ కలుగుతుంటాయి.
సాధారణంగా అన్యూరిజమ్స్ ఉన్నట్లు లక్షణాలేమీ కనిపించవు. అనుకోకుండా ఏ పరీక్ష చేయిస్తున్నప్పుడో బయటపడుతుంటుంది. ఒక్కోసారి వీటివల్ల ఛాతీ, వీపు, కడుపు ప్రాంతాల్లో నొప్పి కలుగుతుంటుంది. ఆ ప్రాంతం ఏ ఇతర అవయవాలకో తగులుతున్నప్పుడు ఇలా అనిపించవచ్చు. అన్యూరిజమ్‌వల్ల నొప్పి, ఇతర ఇబ్బందులు లేకుండా ఉంటే వైద్యుడు వాటిని అలాగే వదిలివేయమంటాడు. ఇబ్బందికర లక్షణాల్ని కలిగిస్తున్నా, పెరుగుతున్నా, లేకపోతే అప్పటికే పెద్దదైనా పగలవచ్చు కాబట్టి శస్తచ్రికిత్స ద్వారా ఆ అన్యూరిజమ్‌ని తొలగించి, మరో గ్రాఫ్ట్‌ని అక్కడ వేస్తారు.
కాళ్ళు, చేతుల్లో వుండే రక్తనాళాలను పెరిఫెరల్ వాస్క్యులార్ సిస్టమ్ అంటారు. ఈ రక్తనాళాలలో డిసీజ్ వస్తే పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజ్ అంటారు. ఎథిరోస్ల్కీరోసిస్‌వల్ల రక్తనాళా లలో వచ్చే ఇబ్బందులు పెరిఫెరల్ వాస్క్యులార్ డిసీజెస్‌లో ఎక్కువ. వీటివల్ల కాళ్ళలో క్లాడికేషన్ లాంటివి కలుగుతాయి. కాళ్ళ పిక్కలు పట్టేస్తాయి. క్రాంప్స్‌లా కలుగుతాయి కొద్ది దూరం నడిచినా. విశ్రాంతి తీసుకోగానే ఆ నొప్పి తగ్గుతుంది. ఆక్సిజన్ సరిగా అందకపోవడంవల్ల పిక్కలలో ఈ ఇబ్బంది కలుగుతుంటుంది. తొడ, పిరుదుల ప్రాంతంలో రక్తనాళాలలో అడ్డంకులవల్లా కాళ్ళలో ‘క్లాడికేషన్’ కలుగుతుంటుంది. పల్స్ చూడడంలో వైద్యుడు ఈ ఇబ్బందిని కనుగొంటుంటాడు. మోకాలు వెనుకభాగం, పాదాలపైన, కాలు పైభాగంలో రక్తనాళాలు మూసుకుపోవడంవల్ల పల్స్‌లో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్టిరియోగ్రఫి.. ఎక్స్‌రే.. కలర్ డాప్లర్ పరీక్షలలో కాళ్లలో రక్తప్రసరణ తీరును కనుక్కోవచ్చు. చేతికి రక్తప్రసరణ తగ్గడంవల్ల చేయి, వేళ్లు మొద్దుబారినట్లవుతుంటాయి. ఈ లక్షణాలేమి కనిపిస్తున్నా గుండె రక్తనాళాల నిపుణుణ్ణి కలవడం అవసరం.

డా.రవికుమార్ ఆలూరి చీఫ్ ఇంటర్‌వెన్షనల్, కార్డియాలజిస్ట్, (కిమ్స్) 98480 24638