సంజీవని

నరాల జబ్బులు.... పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇ.ఇ.జి వేరు ఇ.సి.జి వేరు. ఇ.సి.జితో గుండె కొట్టుకునే విధానాన్ని తెలుసుకోవచ్చు. ఇ.ఇ.జితో మెదడు నుంచి వచ్చే తరంగాల్ని తెలుసుకోవచ్చు.
ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్‌లో ఎలక్ట్రోడ్స్‌ని మాడు ప్రాంతంలోని వాటిని ఎలక్ట్రోసెఫలోగ్రామ్‌కి కలిపి మెదడు ఉత్పత్తి చేసే తరంగాల గ్రాఫ్‌ని గుర్తిస్తారు. ఈ అతి సూక్ష్మ తరంగాల్ని మెదడులోని నర కణాలు ఉత్పత్తి చేస్తుంటాయి. ఏ మాత్రం నొప్పి లేకుండా ఈ పరీక్షని నిర్వహిస్తారు.
అసాధారణమైన తరంగాలేమైనా మెదడులోని నరాల నుంచి వస్తుంటే వాటిని ఆ గ్రాఫ్ ద్వారా గుర్తించవచ్చు. ఎపిలిప్సి, మెదడు కంతుల్ని ఈ పరీక్ష ద్వారా పసిగట్టవచ్చు.
మెదడు చుట్టూ మూడు పొరలు, ద్రావకం ఉన్నట్లే వెన్నుచుట్టూ కూడా మూడు మెనింజిస్ పొరలు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది. మెదడు చుట్టూ వున్న ద్రావకంలోని మార్పులతో మెనింజైటిస్ లాంటి వ్యాధుల్ని పసిగట్టవచ్చు. వెన్ను చుట్టూ వున్న ద్రావకంలోని రసాయన మార్పులతో పోలియో, మెనింజైటిస్, మల్టిపుల్ స్ల్కీరోసిస్, బ్రెయిన్ హేమరేజ్, పక్షవాతం, కంతుల గురించి తెలుసుకోవచ్చు. మిగతా అవయవాలలో మాలిగ్నెంట్ టూమర్స్ ఉంటేనే ప్రాణాంతకం, బినైన్ ట్యూమర్స్ అయితే ఇబ్బంది లేదు. కానీ మెదడులో బినైన్ ట్యూమర్ వున్నా ఇబ్బందే. కారణమేమిటంటే మెదడు, పుర్రె అనే పెట్టెలో మెనింజస్ పొరలతో కప్పి జాగ్రత్తగా ఉంటుంది. బినైన్ ట్యూమర్స్ అయినా పెరిగితే స్థలముండదు. దాంతో మెదుడులో వున్న పదార్థాలు ప్రక్కకి నెట్టబడి సమస్యలుత్పన్నమవుతాయి.