సంజీవని

ఆరోగ్యం అందరికీ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖంగా మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోడానికి ప్రయత్నించాలి. అందుకు ఆరోగ్య అవగాహన తోడ్పడుతుంది. ఈ ఆరోగ్య అవగాహనలో ఆరోగ్యం అంటే ఏమిటి? దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఎటువంటి పరిస్థితుల్లో అది దెబ్బతింటుంది? లాంటి విషయాల్లో ప్రతి ఒక్కరికీ క్షుణ్ణమైన అవగాహన వుండాలి. అందరికీ ఆరోగ్యం కావాలి కాబట్టి అందరూ ఈ విషయాల పట్ల అవగాహనను పెంపొందించుకోవడం అవసరం. అప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. రోగాలు రాకుండా చూసుకోవచ్చు. జాగ్రత్తలతో జీవన విధానాన్ని మార్చుకుంటూ, అలవాట్లను వదులుకుంటూ, అనవసర మందులు వాడకుండా, రోగాలు వస్తుంటే ప్రారంభ దశలోనే గుర్తించి, చికిత్స చేయించుకుంటూ సకాలంలో సరైన విధంగా స్పందించి రోగాల బారినుంచి కాపాడుకోవచ్చు. ఇందులో వ్యక్తి పరిశుభ్రత, ఇంటి పరిశుభ్రత, సమాజ పరిశుభ్రత ప్రధాన పాత్రలు పోషిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుండాలి. అందుకు ప్రధానంగా కావలసినవి పరిశుభ్రత, పోషకాహారం తీసుకోవాలి.
ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నా అనారోగ్యాలు సంక్రమిస్తుంటే చికిత్స చేయించుకోవాలి. అందుకే చికిత్సా విధానాల గురించి రకరకాల పరీక్షలు వాటి అవసరం గురించి తెలుసుకోవాలి. రోగ లక్షణాల్ని ఉపశమించుకోవడం ఎలాగో తెలియాలి. బాధ ఎలా తొలగుతుందో కూడా తెలుసుకుని, సరైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాలి. తగిన ఔషధాల్ని వైద్యుడు చెప్పిన పరిమాణంలో అన్ని రోజులూ తీసుకోవాలి. పథ్యపానాదుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. రోగానంతర జీవన విధానాన్ని తెలుసుకుని తగ్గట్లు నడుచుకోవాలి.