సంజీవని

నల్లటి వలయాలకు కారణాలు అనేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్రశ్న: నా వయసు 22 సంవత్సరాలు. ఈమధ్యకాలంలో నాకు కళ్ల చుట్టూ నలుపు వలయాలు ఏర్పడి అందవిహీనంగా అగుపడుతున్నాయి. ఇలా నేను అందవిహీనురాలవుతున్నానని భావించి మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను, లోపన్‌లను, సబ్బులు డాక్టర్ సలహా లేకుండా వాడటంవలన సమస్య తగ్గకపోగా ఇంకా ఎక్కువై మానసికంగా వేధించబడుతున్నాను. అలాగే కళ్ల నుండి నీరు కారడం, ఒంటిపై దద్దుర్లు, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. మానసిక స్థాయిలో ఆందోళన భయం వంటి లక్షణాలున్నాయి. దయచేసి నా సమస్యకు చక్కని పరిష్కారం చూపగలరు.
-ఓ సోదరి, వరంగల్
జ: కళ్ల చుట్టూ నలుపు వలయాలు అనేవి సరిపడినంత నిద్ర లేకపోవడం, రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత, తీవ్రమైన మానసిక ఒత్తిడి, స్ర్తిలలో బహిష్టులు సక్రమంగా లేకపోవడం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలవల్ల వయస్సుతో నిమిత్తం లేకుండా ఏర్పడుతుంటాయి. మీ సమస్యకు ‘ఆర్సినికం ఆల్బం’ అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సిలో మీరు 15 రోజులకు ఒక్కసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున రెండు నెలలపాటు వాడండి. దీంతోపాటుగా మానసిక ఒత్తిడి తగ్గటానికి యోగా, ప్రాణాయామము వంటివి రోజూ ఉదయం కనీసం 30 నిమిషాలపాటు చేయండి.