సంజీవని

మూత్రం పోస్తుంటే మంట (ప్రశ్న-జవాబు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: నా వయస్సు 35 సంవత్సరాలు. నేను కొద్దికాలంగా డయాబెటీస్ వ్యాధితో బాధపడుతున్నాను. నాకు మూత్రం పోస్తుంటే చురుక్కుమనిపిస్తుంది. మూత్రం చుక్కలు చుక్కలుగా వస్తూ బాధిస్తుంది. ఇప్పటికే చాలా రకాల మందులు వాడాను అయినా సమస్య తగ్గటంలేదు. దయచేసి హోమియో వైద్యంలో నా సమస్యకు పరిష్కరం చూపగలరు.
-రాజు, చేర్యాల
జ: మీ సమస్యకు సరైన మందు ‘కాంథారిస్’. మీరు ఈ మందును వారానికి ఒకసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున నాలుగు వారాలపాటు వాడగలరు. అలాగే నీళ్ళు ఎక్కువగా తాగాలి. మసాలాలు, నూనె పదార్థాలు తగ్గించాలి. ఇలా చేస్తే మీ సమస్య త్వరగా తగ్గుతుంది.
మానసిక స్థాయిలో
గందరగోళం పోయేది ఎలా?
ప్రశ్న: నా వయసు 41 సంవత్సరాలు. నేను ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా పనిచేస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినా, ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైనా పని తలపెట్టినా మానసిక స్థాయిలో గందరగోళంలో డిప్రెషన్‌కు గురై ఆందోళన చెందుతున్నాను. నాకు రెండు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. దయచేసి ఈ సమస్యకు పరిష్కారం చూపగలరు.
-సంతోష్, హైదరాబాద్
జ: డిప్రెషన్‌కు ప్రధాన కారణాలు మెదడులోని కొన్ని న్యూరోట్రాన్స్‌మీటర్ల స్థాయి తగ్గటం, బాహ్య పరిస్థితుల ప్రభావంవలన డిప్రెషన్ మొదలవుతుంది. దీనికి తోడు ప్రవర్తనలో లోపాలు, అసహజ వాంఛలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఆత్మన్యూనత భావన, పర్సనాలిటీ వ్యాధులు, అనుమానాలు, జన్యుపరమైన కారణాలు, శారీరక సమస్యలు మొదలైన అనేక అంశాలు డిప్రెషన్ ఉత్పన్నం కావడానికి దోహదపడుతున్నాయి.
మీ సమస్యకు అర్జెంటం నైట్రికం అనే మందు సరిపోతుంది. ఈ మందును 200 పోటెన్సీలో మీరు 15 రోజులకు ఒకసారి ఉదయం ఒక డోసు, సాయంత్రం ఒక డోసు చొప్పున మూడు నెలలపాటు వాడగలరు. దీంతోపాటుగా మానసిక ఒత్తిడి తగ్గడానికి తమ చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. మనసుకు నచ్చిన సంగీతం వినటానికి ప్రయత్నం చేయాలి. ఒంటరిగా ఉండకుండా మిత్రులతో గడపటం, నచ్చిన పర్యాటక ప్రాంతాలకు మిత్రులతో కలసి వెళ్లాలి. అంతర్మథనాలకు దూరంగా ఉండడం, భావోద్వేగాలను, ఆలోచనలను, అభిప్రాయాలను అణచిపెట్టకుండా ఎప్పటికప్పుడు ఆత్మీయులతో పంచుకోవడం వంటివి చేస్తే డిప్రెషన్ నుండి తొందరగా బయటపడవచ్చు. అలాగే హార్మోనుల సమతుల్యతను కాపాడటానికి మంచి ఆహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి నివారణకు నిత్యం యోగా, మెడిటేషన్‌తోపాటు ఒత్తిడి లేని మంచి జీవన విధానాన్ని అలవరచుకొనుటకు ప్రయత్నం చేయాలి.