సంజీవని

స్థూలకాయం తగ్గటానికి పాలు, పెరుగు (మీకు మీరే డాక్టర్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: పాలు స్థూలకాయాన్ని పెంచుతాయా? స్థూలకాయం తగ్గటానికి ఇంట్లో దొరికే ఉపాయాలు సూచించగలరు?
జె.శారద రమణ, విశాఖపట్టణం
జ: శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. మన శరీరంలో శివుడు మెదడే! మెదడు ఆజ్ఞ లేకుండా శరీరం ఏ మాత్రం స్పందించదు. మనం ఏదైనా తినాలనుకున్నా, మానాలనుకున్నా మెదడు చెప్తేనే జరుగుతుంది. శరీరం మీద మెదడు కట్టడి గొప్పది. చాక్లెట్లు, కేకులు, పిజ్జాల్లాంటి ఎక్కువ కేలరీలున్న ఆహారాన్ని తినాలనే ‘యావ’ మెదడువలనే కలుగుతుంది. మెదడు వద్దని చెప్తే బుట్టెడు బూరెలు ఎదురుగా ఉన్నా చెయ్యి వాటిమీదకు వెళ్లదు.
అయితే శాసనాలను లేదా సంకేతాలను ఇచ్చే మెదడును ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. సమాజ నీతి వాటిలో ఒకటి. సమాజ భయం, ఆరోగ్య భయం, పెద్దవాళ్ళ భయం ఇలాంటివి ఉన్నాయి కాబట్టే, మెదడు లేదా మనసు ఆడించినట్టల్లా మనం ఆడలేకపోతున్నాం. ఇవి వ్యామోహాన్ని, మోహాన్ని అదుపు చేసేలా మెదడును ప్రభావితం చేస్తాయి.
కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఉండే రసాయనాలు కూడా ఈ పని చేస్తాయి. ఉదాహరణకు పాలలో ‘ఇన్సులిన్’ అనే పీచు పదార్థం (ఫైబర్) ఉంది. ఈ ఇన్సులిన్ ఫైబర్లోంచి ఒక ప్రొపియోనేట్‌ని విడుదల అవుతుందనీ, అది ఆకలిని నియంత్రించేలా మెదడును ప్రోత్సహిస్తుందనీ కనుగొన్నారు. మన కడుపులో ఉండే బాక్టీరియా ఇన్సులిన్ ప్రొపియోనేట్‌ని విడుదల చేస్తుంది. పాలలో ఈ ‘ఇన్సులిన్ ఫైబర్’ ఎంత ఎక్కువగా ఉంటే అంతగా ‘తినాలనే కోరిక’ చచ్చిపోతుందన్నమాట. ఎక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకునేప్పుడు ఇంక చాల్లే అనిగానీ, రుచిగా లేదనిగానీ మనసుకు అనిపించటం ఈ ప్రక్రియ లక్ష్యం. శరీరం తనను తాను కాపాడుకోవటానికి ఇలాంటి రక్షణ యంత్రాంగాన్ని కల్పించుకుంటుందన్నమాట.
ఈ ప్రయోగాన్ని చేయటానికి కొంతమందికి ఇన్సులిన్ ఫైబర్ ఎక్కువగా ఉన్న పాలను ఇచ్చి ఎక్కువ కేలరీలున్న పాష్టాలు, పిజ్జాలు పెడితే వాళ్ళు సాధారణంగా తినేదానికన్నా తక్కువగా తిన్నారని నిర్థారణ అయ్యింది. ఆ విధంగా బరువు తగ్గటానికి కూడా పాలు తోడ్పడతాయని భావిస్తున్నారు. ఇన్సులిన్ ఫైబర్‌ని వేరు చేసి, దానితో ఆహార పదార్థాలు వండిపెడితే గణనీయంగా బరువు తగ్గుతారని శాస్తవ్రేత్తలు ఆ దిశగా ప్రయోగాలు చేస్తున్నారు.
పాలలో ఇన్సులిన్ ఒక్కటే ఇందుకు సరిపోదు. ఇన్సులిన్ ప్రొపియోనేట్‌ని విడుదల చేసే బాక్టీరియా కూడా మన పేగుల్లో సమృద్ధిగా వుండాలి. కొందరిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అలాంటివారు సాధారణంగా సమాన బరువు కలిగి ఉంటారని కూడా శాస్తవ్రేత్తలు గమనించారు.
నాణ్యత లేని ఆహార పదార్థాలమీద మనలో వుండే వ్యామోహాన్ని అదుపు చేయటానికి పాలు, మజ్జిగ ఎంతగానో తోడ్పడతాయని ఈ పరిశోధనల సారాంశం. ఫ్రిజ్ చల్లదనం లేని పాలు, పెరుగు, మజ్జిగ తీసుకుంటే స్థూలకాయంలో మంచి నివారణోపాయంగా పనిచేస్తాయన్నమాట. ఎక్కువ కొవ్వు లేని పాలను తీసుకోవటంలో తప్పులేదు.
ఉదయం పూట ఇడ్లీ, అట్టు, పూరి, బజ్జీ, పునుగులకన్నా పెరుగున్నం లేదా మజ్జిగ అన్నం ఎక్కువ ఉపయోగపడుతుంది. అందులో క్యారెట్, ముల్లంగి, కీరదోస, ఉల్లి, టమోటా లాంటి కూరగాయల్ని ముక్కలుగా తిరిగి కలుపుకుని తాలింపు పెట్టుకుని తింటే ఆరోగ్యదాయకంగా వుంటుంది. స్థూలకాయం తగ్గటానికి ఇది మంచి ఉపాహారం.
స్థూలకాయం తగ్గాలంటే, తగ్గించుకోవాలనే నిర్ణయం గట్టిగా ఉండాలి. కొవ్వునీ, కేలరీలనూ పెంచే వాటిపట్ల మనసులో వ్యతిరేక భావం పుట్టాలి. ఇన్సులిన్ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే వ్యక్తి మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. మనోబలం, సంకల్పబలం కావాలి. అన్నింటికన్నా ముందు విదేశీ ఆహార పదార్థాల మీద, రంగునీళ్ళమీద, ఇతర విష పదార్థాలమీద వ్యామోహం ఆగాలి. ఎక్స్‌ర్‌సైజులు చేయకుండా ఆహార నియమాలు లేకుండా ఒళ్ళు తగ్గే మందులేమైనా ఉన్నాయా అని అడిగేవాళ్ళు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి.
రోగ మూలానికి చికిత్స చేసే
‘అగ్నితుండీవటి’
ప్ర: సర్వరోగ నివారిణి లాంటి ఆయుర్వేద ఔషధం ఒకటి చెప్పండి.
-ఎస్.కె.డి.వరప్రసాదరావు, మధిర
జ: ఔషధం రామబాణంలా వెళ్లి, రోగ మూలకారణానికి తగలాలి. చుట్టుకున్న కొసరు బాధలు కూడా పటాపంచలు కావాలి. అలాంటి ఒక గొప్ప ఔషధం అగ్నితుండీవటి. ఏ వ్యాధికి చికిత్స చేస్తున్నా ‘అగ్నితుండీవటి’ తోడుగా తీసుకుంటే వ్యాధి నివారణ సులువౌతుంది.
అగ్నితుండీవటిలో రసాయనాలు, మూలికలూ కలగలసి వుంటాయి కాబట్టి దీన్ని మిశ్రయోగంగా చెప్తారు. ఇందులో క్షారాలు ఉన్నాయి కాబట్టి, ఇతర మందులవలన కలిగే ఎసిడిటీ బాధలు తగ్గుతాయి. ఉబ్బరం పోతుంది. జీర్ణశక్తి పెరిగి ఆహారమూ, ఇతర ఔషధాలు కూడా చక్కగా వంటబడతాయి. కాబట్టి అల్లోపతి మందులు వాడుతున్నవారైనా సరే ఒక గంట ఎడం ఇచ్చి, దీన్ని వాడుకోవచ్చు. అమీబియాసిస్, టైఫాయిడ్, కలరా, అతిసారం మొదలైన జబ్బుల్లో అగ్నితుండివటిని వాడిస్తే పేగుల్లో హానిచేసే సూక్ష్మజీవులు త్వరగా నశిస్తాయి.
ఇది గుండెమీద వత్తిడిని తగ్గిస్తుంది. వాతాన్ని పోగొడుతుంది. అందుకని కీళ్ళవాతంలో వచ్చే గుండె జబ్బుల్లో (రుమాటిక్ హార్ట్ డిసీజ్)లో మంచి ఫలితాలిస్తుంది. గుండె కొట్టుకునే తీరును సమస్థితికి తెస్తుంది. వాత దోషాన్ని పోగొడుతుంది. అన్ని రకాల కీళ్ళనొప్పుల్లోనూ, గౌట్ వ్యాధుల్లో కూడా ఇవ్వదగినదిగా ఉంటుంది. కాళ్ళలోనూ, చేతుల్లోనూ చిన్న చిన్న కీళ్ళలో విపరీతమైన నొప్పి, జ్వరం తగ్గుతాయి. వాయు విడంగాలు ఈ ఔషధంలో కలిసి ఉన్నాయి కాబట్టి, ఈ మాత్రలు స్థూలకాయాన్ని నిరోధించటానికి కూడా ఉపయోగపడతాయి.
అగ్నితుండీవటిని పిల్లలకు ఒక మాత్ర, పెద్దలకు రెండు మాత్రల చొప్పున రెండు పూటలా వేసుకోవచ్చు. చంటి బిడ్డలకు వైద్యుడి సలహామీద వాడటం మంచిది. ఈ మాత్ర వేసుకుని అల్లం రసం తాగితే అజీర్తి తగ్గుతుంది. మలబద్ధకత పోయి, విరేచనం ఫ్రీగా అవుతుంది. మిరియాలు, బెల్లం కలిపి కాచిన పాలు తాగితే కఫం, దగ్గు, జలుబు, తుమ్ములు తగ్గుతాయి. ఉబ్బసం నెమ్మదిస్తుంది. రోజూ ప్రొద్దునపూట ఒకటీ లేక రెండు మాత్రలు ఇలా మిరియాల పాలతో తాగుతూ వుంటే ఎలెర్జీ వ్యాధి తీవ్రత బాగా తగ్గుతుంది. వైరల్ జ్వరాల్లో ఇది బాగా పనిచేస్తుంది. ఉదయానే్న అగ్నితుండీవటి మాత్రలు వేసుకుని ఆవు పాలు తాగుతూ వుంటే నరాల బలహీనత తగ్గుతుంది. పాలలో అశ్వగంథ చూర్ణం కలుపుకుని బాగా కాచి తాగితే నరాలు, మెదడు వ్యాధుల్లో ప్రభావాన్ని చూపిస్తుంది. ద్రాక్షారిష్ట 2-3 చెంచాలు తీసుకుని కొద్దిగా నీళ్ళు కలిపి తాగితే గుండె జబ్బులున్నవారికి మేలు చేస్తుంది. అగ్నితుండి వేసుకుని ఒక అరచెంచా పొడపత్రి ఆకు పొడిని గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే, షుగరు వ్యాధిలో ఉపద్రవాలు త్వరగా తగ్గుతాయి. దీర్ఘకాలం వాడుకోదగిన ఔషధం ఇది.

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com