సంజీవని

ఆధుర్దా... అనర్థాలకు కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవాళా రేపు ఆధునిక జీవితంలో చేసే పనులకన్నా ఆలోచనలు ఎక్కువయిపోతున్నాయి. అనవసరపు ఆలోచనలతో మానసిక వత్తిడి పెరుగుతుంది. ఈ మానసిక వత్తిడే చాలా అనారోగ్య సమస్యలకు కారణవౌతుంది. వత్తిడితో మనిషి వ్యక్తిత్వమే మారిపోతుంది. మనిషిలోని ఉద్రేకాల్ని వత్తిడి అణుస్తుంటుంది. దాంతో ఆ వ్యక్తి మానసికంగానే కాదు, శారీరకంగా కూడా వత్తిడికి లోనై కడుపులో పుండ్లు, మైగ్రేన్ తలనొప్పులు, ఆహారనాళ సమస్యలు, అధిక రక్తపోటు, పక్షవాతం, గుండెపోటులాంటి వాటికి లోనవుతున్నాడు. కొందరిలో వత్తిడి క్రమంగా ఉండటంతో ఈ ఇబ్బందులొస్తుంటాయి. అంతేకాదు, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్స్ ఎదుర్కొనే శక్తి తగ్గుతుంది. ఇలా వత్తిడితో వరుసగా బాధపడుతూ వుంటే కాన్సర్ లాంటి అనారోగ్యాలు రావచ్చు.
వత్తిడి పెరగడంతో మెదడు కొన్ని రసాయనాల్నీ, హార్మోన్స్‌నీ ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. అలా ఉత్పత్తి అయిన ఎడ్రినలిన్, హైడ్రోకార్డిసోన్ మనిషిలో పోరాడేశక్తిని పెంపొందిస్తుంది. ఎడ్రినలిన్‌తో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. శ్వాస తీవ్రమవుతుంది. శరీరాన్ని వత్తిడికి తట్టుకుని అవతలి శక్తుల్ని ఎదుర్కొనే శక్తిని పెంపొందిస్తుంది. ఉదాహరణకి మనం ఏ దుర్వార్త విన్నా ముందు ఎడ్రినలిన్ ఉత్పత్తి పెరిగి తర్వాత హైడ్రోకార్టిసోన్ ఉత్పత్తి ఎక్కువవుతుంది. తక్కువసేపు ఉత్పత్తి అవటం వల్ల వత్తిడికి తట్టుకునేటట్లు చేసే ఈ హార్మోన్లు, ఎక్కువసేపు ఉత్పత్తి అయితే తీవ్ర శారీరక ఇబ్బందులు కలగవచ్చు. ఎక్కువకాలం ఉత్పత్తి అవటంవల్ల గుండె కొట్టుకునే వేగం, శ్వాసించే సార్లు పెరిగి అధిక రక్తపోటు కలిగిస్తాయి. హైడ్రోకార్టిసోన్ ఎక్కువగా ఉత్పత్తి అవటంవల్ల కడుపులో పుళ్ళు రావచ్చు. రోగనిరోధక శక్తి తగ్గవచ్చు.
వత్తిడిని తట్టుకోవడం నేర్చుకోవాలి. అందుకు సమతుల ఆహారం తీసుకోవటంతోపాటు, కావాల్సినంత నిద్రా ఉండాలి. రోజూ వ్యాయామం చేస్తుండాలి. మనసుకు ఆస్లాదం కలిగించే విషయాల్లోనే ఎక్కువ సమయం గడపాలి. మీకు మీ ఒత్తిడిని తట్టుకునే శక్తి లేకపోతే మానసిక వైద్య నిపుణున్ని కలిసి అవసరమైన కౌన్సిలింగ్ తీసుకోవాలి. తేలిగ్గా స్పందించి ఇబ్బంది పడేవాళ్ళు యోగా, సంగీతం, సాహిత్యం లాంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ సహకారం తీసుకోవాలి. వత్తిడి నిద్ర సమస్యలకీ దారితీయవచ్చు. అలాగే ఆదుర్దాకీ లోనవుతాం.

-డా.పి.సి.పి.గుప్త. సైక్రియాటిస్ట్, మానసిక చికిత్సాలయం, హైదరాబాద్..9848063547