సంజీవని

యాంటాసిడ్స్ వల్ల లాభమా? నష్టమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగ్గా వాడినపుడు మంచి ఫలితాన్నిస్తుంది. అలాగని ఇష్టం వచ్చినట్లు వాడితే ఫలితాలు విపరీతంగానే వుంటాయి. కాల్షియం కార్బొనేట్ యాంటాసిడ్స్ త్వరగా విముక్తినిస్తాయి. కడుపులో కుళ్ళు ఉన్నవారికి ఈ యాంటాసిడ్స్‌ను వైద్యులు సాధారణంగా ఇవ్వరు. సోడియం వున్నటువంటి యాంటాసిడ్స్‌ను ఉప్పును ఆహారంగా తీసుకోవటంపట్ల నిషేధం ఉన్నవాళ్ళు తీసుకోకూడదు. ఎక్కువ కాలంనుంచి యాసిడ్ సమస్యతో బాధపడేవాళ్ళు టాబ్లెట్స్‌రూపంలో కన్నా ద్రవ రూపంలో ఉన్న యాంటాసిడ్స్ తీసుకోవడం మంచిది. కొన్ని యాంటాసిడ్స్‌తో అజీర్ణం కలుగుతుంది. మరికొన్ని యాంటాసిడ్స్‌తో విరోచనాలు కలుగుతాయి. కాబట్టి సమస్యలకు తగిన యాంటాసిడ్స్‌ని ఎంపిక చేసుకోవడం అవసరం.
సోడియం సమస్య కాకపోతే బేకింగ్ సోడాని నీళ్ళలో కరిగించి తీసుకోవచ్చు. అందుకని ఏ రకమైన యాంటాసిడ్స్ అవసరమో కూడా తెలుసుకుని మరీ తీసుకోవడం మంచిది.

-డా.గోవింద్ ఆర్.వర్మ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్, 8885095601