సంజీవని

ఎముకలు.. అనారోగ్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలు ఎంత గట్టిగా కనిపిస్తున్నా వాటికీ ఇన్‌ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి వాటిలో ఆస్టియోమైలైటిస్ ఒకటి. ఇది చాలా అరుదుగా వచ్చే ఎముకల ఇన్‌ఫెక్షన్. బయటికి తెరుచుకున్న గాయంలోంచి వచ్చే బాక్టీరియాతో ఈ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. రక్తం ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కడికైనా వ్యాపింపవచ్చు. ఆస్టియోమైలైటిస్ వచ్చిన ప్రాంతాలు ఎర్రబడవచ్చు. ఆ అవయవాన్ని ఉపయోగించం కష్టమవుతుంది. ఆ ప్రాంతంలో నొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
యాంటీబయాటిక్స్ వాడి ఈ ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ చేయవచ్చు. సాధ్యమైనంత త్వరగా చికిత్స అవసరం. ఆలశ్యమైనకొద్దీ ఇన్‌ఫెక్షన్ వ్యాపించి చికిత్స కష్టమవుతుంది. శస్త్ర చికిత్స అవసరం కావచ్చు.
‘రికెట్స్’ ఎముకలకు వచ్చే మరో వ్యాధి. పిల్లలలో కనిపిస్తుంటుంది. విటమిన్ డి లోపంవల్ల వస్తుంది.
చిన్న పిల్లల్లోలాగానే పెద్దవాళ్ళలో కూడా రికెట్స్ వ్యాధి వస్తుంది. దీన్ని ఆస్టియో మలేషియా అంటారు. ఇది కూడా విటమిన్ డి లోపంవల్లే కలుగుతుంది. గర్భిణీలకు ఆస్టియో మలేషియావల్ల అపకారం ఎక్కువ. ఆహారం సరిగా తీసుకోకపోవటంవల్ల సూర్యరశ్మికి సరిగ్గా ఎక్స్‌పోజ్ కాకపోవటంవల్ల పెద్దల్లో ఇది రావచ్చు.
ఆస్టియైటిస్‌ని పాజెట్స్ డిసీజ్ అని కూడా అంటారు. మామూలుగా ఎముక నిర్మాణం, పునర్నిర్మాణ వేగం పెరగడంతో ఎముక అపాయకరంగా పెరుగుతుంది. దీన్ని పాజెట్స్ డిసీజ్ అంటారు. క్రమంగా శరీరంలోని అన్ని ఎముక భాగాలు నీరసిస్తాయి. తరచూ ఈ ఎముకలు నొప్పిగా ఉంటాయి. పుర్రె కూడా దీనికి లోనయినపుడు ఆడిటరీ నర్వ్స్‌మీద ఒత్తిడి పెరిగి వినికిడి తగ్గవచ్చు. పాజెట్స్ డిసీజ్‌కి అసలు కారణం తెలియదు. ఒక విధమైన వైరస్‌ని కారణంగా అనుమానిస్తున్నారు. ఇది నెమ్మదిగా, లక్షణాలు కనిపించకుండా పెరుగుతుంది. తరచుగా ఎముకలు విరుగుతూ నొప్పి ఎక్కువగా ఉంటుంది. కేవలం నొప్పిని తగ్గించకుండా వీలవుతుంది గానీ ఈ జబ్బుకు చికిత్స లేదు.
రెండు అంతకన్నా ఎక్కువ ఎముకలు కలిసే భాగాన్ని కీళ్ళు అంటారని అందరికీ తెలుసు. కానీ ఈ కీళ్ళని అధికంగా వినియోగించడంవల్ల అవి అరిగి ‘ఆర్థరైటిస్’ అనే జబ్బు వస్తుందని కొందరికే తెలుసు. ఈ ఆర్థరైటిస్ రెండు రకాలు. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్. ఎముకలు అరిగిపోవటంవల్ల వచ్చే ఆర్థరైటిస్‌ను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఇది సాధారణంగా ఒకటి రెండు కీళ్ళల్లోనే వస్తుంది. చాలా చిన్న కీళ్ళను దెబ్బతీస్తూ, ఇతర కండరాల్ని దెబ్బతీస్తూ వచ్చేది రుమటైడ్ ఆర్థరైటిస్. రుమటైడ్ ఆర్థరైటిస్‌లో ఇన్‌ఫ్లమేషన్ ప్రధానం. కీళ్ళను చుట్టి ఉంచే సైనోవియల్ పొర నుంచి కార్టిలేజ్‌కి, అక్కడినుంచి లోపలి ఎముకకి వస్తుంది రుమటైడ్ ఆర్థరైటిస్. కొన్ని సందర్భాల్లో ఈ ఇన్‌ఫ్లమేషన్ కళ్ళకీ, ఆర్టరీస్ రక్తనాళాలకీ, లోపలి అవయవాలకీ కూడా వ్యాపించవచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ నెమ్మదిగా పెరుగుతుంది. కానీ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇది ముఖ్యంగా వయసులో ఉన్నవాళ్ళలో, ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. రుమటైడ్ ఆర్థరైటిస్‌వల్ల నొప్పి ఎక్కువ. వేళ్ళు లాంటి అవయవాలు బిగుసుకుపోతాయి. ఉదయం పూట ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. చికిత్స ఆలస్యం అవుతున్నకొద్దీ లక్షణాలు తీవ్రతరమవుతాయి. చిన్న కీళ్ళు దెబ్బతినవచ్చు. బరువు తగ్గవచ్చు. రక్తహీనత, అలసట కలగవచ్చు. కాబట్టి ప్రారంభ దశలోనే కనుక్కోవటం అవసరం.

-డా సాయి లక్ష్మణ్ ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్.. 9704500909