సంజీవని

మనో శారీరక వ్యాధులంటే...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: మనో శారీరక వ్యాధులంటే...?
మానసిక వ్యాధులకు మనో శారీరక వ్యాధులకు మధ్య తేడా ఉంది. ఆ సున్నితమైన తేడాని గుర్తించక చాలామంది తికమక పెడుతుంటారు.
సైకోసొమాటిక్ వ్యాధుల్లో చర్మం మీద లక్షణాలు కనిపిస్తయి. కారణం మానసికం. అందుకు ఉదాహరణలు- గజ్జి, కడుపులో పుళ్ళు, ఆస్త్మా, మైగ్రేన్ తలనొప్పులు లాంటివి. మానసిక వత్తిడి ప్రభావం చర్మం మీద, ఆహార నాళంలో, ఊపిరితిత్తులు లాంటి అవయవాల మదా పడి, అవి దెబ్బతింటాయి. ఆ అవయవాలకు చికిత్స చేయడమంటే మానసికంగా ఒత్తిడిని తగ్గించడమే. ఒత్తిడితోబాటు ఆదుర్దా, టెన్షన్ లాంటివీ కారణాలు. వంశపారంపరంగా వచ్చే సమస్యలూ కారణం. మానసికంగా పరీక్షించి కౌన్సిలింగ్‌తోబాటు తగ్గడానికీ మందులిస్తారు.
మానసిక జబ్బులు భిన్నం. వీటకి వంశపారంపర్యం వచ్చే లక్షణాలతో బాటు మెదడుతోపాటు మొదలైన వాటివల్ల ఆలోచనలు భిన్నంగా ఉండడం. వ్యక్తిత్వం మామూలుగా ఉండకపోవడం, స్పిట్ పర్సనాలిటి, ఒత్తిడి ఆదుర్దా అతిశుభ్రత, ఎవరో చెవిలో మాట్లాడుతున్నట్లుండడం, భ్రమలు, అనుమానాలు, డిప్రెషన్, కృంగిపోవడం, ఆత్మహత్యా ఆలోచనలు మానసిక సమస్యలు. వీటి గురించి వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం.