సంజీవని

కడుపులో పుళ్లకు...?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపులో పుళ్లున్నవాళ్లు పాలని తాగడం మంచిదనే నమ్మిక ఉంది. మరీ ఎక్కువ పాలు తాగడం కూడా మంచిది కాదు. ఎక్కువ పాలని తాగడంవల్ల కడుపులో యాసిడ్స్ ఉత్పత్తి అవుతాయి.
ఎక్కువ ఆల్కహాల్ తాగితే ఆహార నాళం లోపల ఉండే పొర దెబ్బ తింటుంది. అలాగే ఖాళీ కడుపు మీద కాఫీ తాగడం కూడా మంచిది కాదు. కాఫిన్ యాసిడ్ ఉత్పత్తిని అధికం చేస్తుంది.
అందుకే ఇప్పుడు వైద్యులు ఏ ఆహారం, డ్రింక్‌వల్ల మీకు ఇబ్బంది కలుగుతున్నట్లనిపిస్తుందో వాటికి దూరంగా ఉండండి అంటున్నారు.
ధూమపానం చేసే అలవాటుంటే మానివేయండి. ధూమపానం వల్ల కడుపులో పుళ్లు ఏర్పడకపోవచ్చు. కానీ అవి విస్తరించడానికి ధూమపానం తోడ్పడుతుంది. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి కడుపునిండా తినడం కన్నా ఆరారా కొద్దికొద్దిగా తినడం మంచిది. కడుపులో ఆహారంతో యాసిడ్ బెడద కొంత తగ్గుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచడం కూడా చాలా అవసరం. సరైన నిద్ర ఉండాలి.