సంజీవని

వర్షాకాలం.. రోగాలమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరేచనాలు ప్రధానంగా రెండు కారణాల వల్ల వస్తుంటాయి. బాక్టీరియా కారణంతో కలిగే బాసిలరీ డిసెంట్రి ఒక రకం. అమీబియావల్ల వచ్చే అమీబియాసిస్ రెండోరకం. ప్రారంభ దశలో రెండు రకాల విరేచనాలు ఒకేవిధంగా ఉంటాయి. చికిత్స చేయించడానికి ఏ రకమైన విరేచనాలు అన్న విషయం తెలుసుకోవడం అవసరం.
అమీబియాసిస్‌లో విరేచనాలు ఎడతెగకుండా అలా అవుతునే ఉంటాయి. బరువు తగ్గుతారు. విరేచనాలు వాసన కొడుతుంటాయి. కడుపులో ఉబ్బరం. అమీబియాతో లివర్, లంగ్స్‌లో చీము పట్టవచ్చు. రెండవ రకం గయార్డయాసిస్ ఆహారం ద్వారా కన్నా నీటి ద్వారా వ్యాపిస్తుంటుంది. కారణాన్ని గుర్తిస్తే ఈ రెండు రకాల విరేచనాలను అరికట్టవచ్చు.
సరిగా ఉడకని ఆహారం ద్వారా సాల్మనెల్లా బాక్టీరియా ఇన్‌ఫెక్షన్ వస్తుంది కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు అవుతాయి. జ్వరం, వాంతులురావచ్చు. సరిగా ఆహారాన్ని వండి తినడంతో ఈ బాక్టీరియానుంచి రక్షణ కల్పించుకోవచ్చు.
కోస్ట్రిడియమ్ బాక్టీరియా ‘బొటులిజమ్’ వస్తుంది. సరిగా నిల్వ ఉంచని ఆహారం ద్వారా ఈ బాక్టీరియా విస్తరిస్తుంటాయి.
వర్షాకాలంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీటి కాలుష్యం ప్రబలే ప్రమాదాలు ఎక్కువ. నీటి ద్వారా, సరిగా ఉడకని, సరిగా నిల్వ వుంచని ఆహార పదార్ధాల ద్వారా ఈ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వర్షాలవల్ల ఇంటి పరిసర ప్రాంతాలలో నీరు నిలువవుండి రకరకాల ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.
వాడి పారేసే వస్తువులు, చిన్న చిన్నగుంటలుంటే ఆ ప్రాంతాలలో నీరు నిలువ ఉండి దోమలు లాంటి క్రిములు చేరతాయి. అందుకని ఇంటి చుట్టు నీరు నిలువకుండా చూసుకోవాలి. తడి దుస్తులు ధరించరాదు. తల తడవకుండా చూసుకోవాలి. వాన నీళ్లు శుభ్రంగా ఉండవు. అందుకని వాననీటిలో తడిస్తే ఇబ్బందులు రావచ్చు. తేమ, చీకటి సూక్ష్మ జీవులు పెరగడానికి అవసరమైన పరిస్థితులు. అందుకని ఈ రెండింటికీ మన పరిసరాల్ని దూరంగా ఉంచాలి. గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి.

-డా.గోవింద్ ఆర్.వర్మ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్, 8885095601