సంజీవని

క్యాన్సర్‌గా లివర్ సిర్రోసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెపటైటిస్‌కి, సిర్రోసిస్‌కి మధ్య చాలా తేడా వుంది. సిర్రోసిస్ మరింత ప్రమాదకరం. సిర్రోసిస్ అంటే లివర్ స్కారింగ్, ఇన్‌ఫ్లమేషన్. ఇది శాశ్వతంగా కలిగే అపాయం. పునరుత్పత్తి అయ్యే కణాలు భిన్న రూపాలలో వస్తూ లివర్‌లోపలి రక్తప్రరణకి అడ్డంపడుతుంటాయి. కొన్ని దెబ్బతిన్న కణాలు పునరుత్పత్తి కావు.
తీవ్రమైన సిర్రోసిస్‌లో కొన్ని కణాలు ఫైబ్రిస్ కణాలుగా మారి క్రమంగా లివర్ మీద ఓ గీతగా ఏర్పడతాయి. క్రానిక్ హెపటైటిస్ లివర్ సిర్రోసిస్‌గా మారుతుంది. ఈ సిర్రోసిస్ ముఖ్యంగా ఆల్కహాల్ అలవాటువల్ల కలుగుతుంది. కొన్ని మందులు, రసాయనాలు లాంటివాటివల్లా సిర్రోసిస్ వస్తుంది.
కొంతమంది సిర్రోసిస్ ఉన్నవాళ్ళు శుభ్రంగా తిని తిరుగుతుంటారు. కాని అన్నిసార్లూ అలా తప్పించుకోలేరు. ప్రధాన లక్షణం ఉప్పు పేరుకోవడం. కాళ్ళు, కడుపు వాస్తాయి. గొంతులో రక్తస్రావం- అక్కడి వీన్స్ రక్తనాళాలలో ఒత్తిడి పెరగడంవల్ల కలగవచ్చు. ఇది చాలా అపాయకర లక్షణం. వెంటనే చికిత్స పొందాలి. కడుపు ముట్టుకుంటే నొప్పి. మలము నల్లగా రావడం- లోపల రక్తం కారడంవల్ల మలము ఆ రంగులోకి మారుతుంది. జాండిస్ వస్తుంది. ముఖంమీద సాలీడు గూడులా ఎర్ర మరకలు వస్తాయి. అలాటి మరకలే ఛాతిమీద, చేతులమీదా కూడా రావచ్చు. తిక్క తిక్కగా ఉండడం, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి లక్షణాలతోబాటు కోమాలోకి వెళ్ళవచ్చు. మద్యపానాన్ని సేవించేవాళ్ళలో 15 శాతం మందికే సిర్రోసిస్ ఎందుకు వస్తుంది అంటే చెప్పడం కష్టం. ఆల్కహాల్ సేవనంతోపాటు మంచి ఆహారాన్ని తీసుకోకపోవడం కూడా కారణమంటారు పరిశోధకులు. అనస్థటిక్స్ శుభ్రపరిచే ద్రావకాలు, కొన్ని మందులవల్ల కూడా ఇలా రావచ్చు.
సిర్రోసిస్ ఉందన్న విషయం రక్తం, మూత్ర పరీక్షలతోపాటు లివర్ బయాప్సీలోను తేలుతుంది. మైల్డ్ సిర్రోసిస్ ఉంటే తగ్గించవచ్చు. లివర్ మీద గీతలుగా పడి, కుచించుకుపోతే ఎవరూ ఏమీ చేయలేరు. సిర్రోసిస్ క్రమంగా కాన్సర్‌గా కూడా మారవచ్చు. హెపటైటిస్-బి లాంటివి సిర్రోసిస్‌లోకి దించవచ్చు.

-డా.గోవింద్ ఆర్.వర్మ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, పేస్ హాస్పిటల్స్, 8885095601