సంజీవని

మానసిక ఆరోగ్యం లోపిస్తే నరకమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక విధమైన నిస్సహాయతకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. జీవితం మీద, చేసే పనులమీద ఉత్సాహాన్ని కోల్పోయి, నిస్సహాయస్థితిలో మరణించాలనే ఆలోచన ఆవిర్భవిస్తుంది.
వయసు పెరుగుతున్న వాళ్ళలో, ఒక్కళ్ళే ఉండే భర్త లేక భార్య పోయినవాళ్ళలో, విడాకులు పొందిన వాళ్ళలో, షిజోఫ్రినియా అనే మానసిక జబ్బుతో బాధపడేవాళ్ళలో, మద్యం, మత్తుమందులకు అలవాటుపడిన వాళ్ళలో ఈ ఆలోచన ఎక్కువగా వస్తుంటుంది.
ఈ ఆత్మహత్యలు ఆడవాళ్లలో కన్నా మగవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇల్లూ వాకిలి లేనివాళ్ళలో నేరప్రవృత్తే కాదు, ఆత్మహత్యా ఆలోచనలూ ఎక్కువ!
ఏ కారణానైనా నిస్సహాయతకకు లోనవుతున్నవాళ్లకి మానసిక చికిత్స చాలా అవసరం. శరీరానికి ఎన్ని రకాల జబ్బులు వస్తాయో మనసుకి అన్ని రకాల జబ్బులు వస్తాయి. అంతేగాని మనస్సుకి వచ్చే జబ్బులన్నింటిని ‘పిచ్చి’ అనే ఒకే గాటికి కట్టి వాళ్ళను కించపరచకూడదు. మానసిక జబ్బులకి రకరకాల మందులున్నాయి. కౌన్సిలింగ్ అవసరమవుతుంటుంది. మన దేశంలో మనం, ఏటా శారీరక జబ్బులేమైనా వచ్చాయోమోనని పరీక్షలు చేయించుకుంటామో- పాశ్చాత్య దేశాలలో అలాగే మానసిక స్థితిని సరిచేయించుకోవడానికి మానసిక శాస్తవ్రేత్తలను, మానసిక చికిత్సా నిపుణుల్ని కలుసుకుంటారు. శారీరక ఆరోగ్యంతోబాటు మానసికారోగ్యం కూడా బాగా ఉన్నప్పుడే మనం పూర్తి ఆరోగ్యవంతులుగా లెక్క!