సంజీవని

షుగర్ తొలి దశలో ఈ జాగ్రత్త అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్ర: ఒకచోట పరీక్ష చేయిస్తే షుగరు ఉందన్నారు. ఇంకోచోట చూపిస్తే బోర్డర్‌లోనే ఉందన్నారు. నాకు నీరసం, బలహీనత ఎక్కువగా ఉంటున్నాయి. నాకు షుగరు ఉన్నదో లేదో ఎలా తెలుసుకోవటం..?
-జె.కె.ప్రసాద్, ఖమ్మం

జ:చిన్న కర్రని విరవడం కష్టం. బోర్డర్‌మీద ఉన్న షుగరుని కంట్రోల్ చేయడం కూడా అంతే కష్టం. 300-400.. ఇలా పెరిగిపోయిన షుగరుని సాధారణ స్థితికి తేవడానికి ఇవ్వాళ చాలా అద్భుతమైన ఔషధాలున్నాయి. కానీ, బోర్డర్‌మీద ఉన్నప్పుడు తొందరపడి మందులు వేయరు. దాన్ని ఎవరికివారే ఆహార జాగ్రత్తల ద్వారా అదుపులో పెట్టుకోగలగాలి.
మనం ఆహారంలో ఎక్కువ భాగం గ్లూకోజ్‌గా మారుతుంది. ఆ గ్లూకోజ్‌ని శరీరం శక్తిగా మార్చుకుని వాడుకుంటుంది. మన పొట్టలో ఉండే పాంక్రియాజ్ (అగ్న్యాశయం) అనే అవయవం ఇన్సులిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది శక్తి మార్పిడికి తోడ్పడుతుంది. ఇదంతా అందరికీ తెలిసిన కథే!
చాలాకాలంపాటు పాంక్రియాజ్ తగినంతగా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోయినా, శరీరం ఆ ఇన్సులిన్‌ని ఉపయోగించుకోలేకపోయినా అది షుగరు వ్యాధికి దారితీస్తుంది. పూర్తిగా ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయినపుడు అది టైప్-1 షుగరు వ్యాధి అనీ, ఉత్పత్తి అయిన ఇన్సులిన్‌ని శరీరం తగినంతగా ఉపయోగించుకోలేకపోవటాన్ని టైప్-2 షుగరు వ్యాధి అనీ పిలుస్తారు. దీనే్న ఇన్సులిన్ నిరోధక వ్యాధి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని కూడా అంటారు. మొత్తంమీద శక్తి ఉత్పత్తి తగ్గిపోవటం అనేది ఈ వ్యాధిలో ప్రధానాంశం.
ఇన్సులిన్‌ని శరీరం ఎంతలా ఉపయోగించుకుంటుందో అంచనా వేయడం ద్వారా షుగరు వ్యాధి నిర్ధారణ చేయటం సాధ్యవౌతుంది. రక్తంలో షుగరు సాధారణ స్థితిలోనే ఉన్నప్పటికీ పొలిమేరల మీద (బోర్డర్‌లైన్) నడుస్తున్నపుడు ఎక్కువ జాగ్రత్త అవసరం అవుతుంది. పొలిమేరల మీద ఉన్నవారు షుగరు వ్యాధి వచ్చినట్టుగానే భావించి, షుగరు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. తొందరపడి మందులు వాడనవసరం లేదు.
బోర్డర్ మీద ఉన్న స్థితిని ‘ప్రి-డయాబెటిస్’ అంటే ‘షుగరు వ్యాధి పూర్వరూపం’గా భావించవచ్చు. ఈ దశలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే రక్తంలో షుగర్ బోర్డర్ మీంచి వెనక్కి వచ్చే అవకాశం వుంది. ఆ మేరకు వ్యాధిని కొంతకాలం వాయిదా వేయగలిగినట్టే!
రక్తంలో షుగరు ఖాళీ కడుపున 100-110 మి.గ్రా దాటి ఉన్నపుడు జి.టి.టి. పరీక్ష చేయించుకోవటం మంచిది. గ్లూకోజ్‌ని శరీరం శక్తిగా మార్చుకునే క్రమం బాగానే జరుగుతుంటే పొలిమేరల్లో ఉన్నప్పటికీ ఖంగారుపడాల్సిన పని ఉండదు. గ్లూకోజ్‌ని శరీరం ఎంత వాడుకుంటోందో తెలియజేసే పరీక్షని గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (జి.టి.టి) అంటారు. ఈ పరీక్షను రెండవ రకం షుగరు వ్యాధిలో చేస్తారు.
సాధారణంగా ఎవరికైనా ఆహారం తీసుకోగానే, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. రక్తంలోకి చేరిన షుగర్‌ని శరీరం ఇతర స్థావరాల్లో నిలవ చేయటం లేదా శక్తిగా మార్చుకోవటం చేయగానే రక్తంలో షుగరు సాధారణ స్థాయికి వచ్చేస్తుంది.
ఖాళీ కడుపున రక్తంలో షుగరు ఎంత వుందో చూసుకుని, పంచదార (గ్లూకోజ్) ద్రావణాన్ని త్రాగి, 5 నిమిషాలకు, 30 నిమిషాలకు, గంటకు, రెండు గంటలకు రక్తంలో షుగరు ఎంతెంత ఉంటోందో పరీక్షిస్తారు.
ఖాళీ కడుపున 95మి.గ్రాలకన్నా తక్కువగా ఉంటేనే సురక్షితం. గంట తరువాత 180 మి.గ్రా. లకన్నా తక్కువగా ఉండాలి. 2 గంటల తరువాత 155 మి.గ్రా. లకన్నా తక్కువగా ఉండా లి. 3 గంటల తరువాత అది 140 మి.గ్రా.లకన్నా ఎక్కువ ఉండకూడదు. 199 మి.గ్రా.ల దాకా వెడితే బోర్డర్‌మీద వున్నట్టు. అంతకుమించితే లోపల షుగరు వ్యాధి కంట్రోల్లో లేనట్టు!

డా జి.వి.పూర్ణచందు, సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్, సత్యం టవర్స్, 1వ అంతస్థు, బకింగ్‌హాంపేట, పోస్ట్ఫాసు ఎదురు, గవర్నర్‌పేట, విజయవాడ-500 002. సెల్: 9440172642, purnachandgv@gmail.com