సంజీవని

భయం... గుండెకు చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె, గుండె వ్యాధులంటేనే ప్రజలలో ఓ విధమైన భయం ఉంది. దాన్ని మనం పెంచకూడదు. రోగి ధైర్యంగా నిలుచుని,
తన గుండె సమస్యని తాను తగ్గించుకోగలిగేలా చూడాలి. కరొనరి కేర్ యూనిట్‌లో తీసుకుంటున్న శ్రద్ధ అతనిలో ధైర్యాన్ని పెంచుతుంది.
మంచివైద్యుల పరిరక్షణలో ఉన్నాను, ప్రాణభయం లేదనుకునే ధైర్యాన్ని ఏ కారణానాన దెబ్బతీయకూడదు. మానసిక ధైర్యమే బ్రతుకుమీద ఆశని పెంచుతుంది. వైద్యుడు చెప్పినట్లు జీవన విధానాన్ని మార్చుకోవడానికి తోడ్పడుతుంది. అందుకే ఈ రోగులకు సైకలాజికల్ కౌన్నిలింగ్ అవసరం.
గుండె సమస్యలవల్లో, మరే కారణంతోనైనా ఎమర్జెన్సీ వార్డ్‌లో చేరితే రోగుల్లో కంగారు రావడం సహజం. అతని మానసిక ఒత్తిడిని మరింత పెంచుతారు చూడడానికి వచ్చిపోయేవాళ్ళు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించి రోగి బంధువులు, మిత్రులు అనవసరమైన విషయాల్ని చెప్పి బెంబేలెత్తించకూడదు.
గుండె, గుండె వ్యాధులంటేనే ప్రజలలో ఓ విధమైన భయం ఉంది. దాన్ని మనం పెంచకూడదు. రోగి ధైర్యంగా నిలుచుని, తన గుండె సమస్యని తాను తగ్గించుకోగలిగేలా చూడాలి. కరొనరి కేర్ యూనిట్‌లో తీసుకుంటున్న శ్రద్ధ అతనిలో ధైర్యాన్ని పెంచుతుంది. మంచివైద్యుల పరిరక్షణలో ఉన్నాను, ప్రాణభయం లేదనుకునే ధైర్యాన్ని ఏ కారణానాన దెబ్బతీయకూడదు.
మానసిక ధైర్యమే బ్రతుకుమీద ఆశని పెంచుతుంది. వైద్యుడు చెప్పినట్లు జీవన విధానాన్ని మార్చుకోవడానికి తోడ్పడుతుంది. అందుకే ఈ రోగులకు సైకలాజికల్ కౌన్నిలింగ్ అవసరం.
చాలామంది తమ సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుందని భయపడుతుంటారు. ఈ గుండె అనారోగ్య చికిత్సతో కొంత నీరసపడే మాట నిజం. కొంతకాలం శరీరానికి.. ముఖ్యంగా గుండెకి విశ్రాంతినివ్వడం అవసరం. సెక్స్‌లో గుండె కొట్టుకునే వేగం 120 నుంచి 130దాకా ఉంటుంది. కాబట్టి అంత భారాన్ని గుండెమీద వెంటనే వేయకూడదు. ఈ విషయంలో గుండె చికిత్సా నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. వ్యాయామం గురించి కూడా!
గుండెమీద భారం ఎక్కువ పడకుండా సెక్స్‌లో పాల్గొనే విధానాల్ని తెలుసుకోవాలి. సెక్స్ సామర్థ్యం పెంచే మందుల్ని వైద్యుడి సలహా లేకుండా వేసుకోకూడదు. కొన్ని మందులవల్ల సెక్స్ కోరిక తగ్గవచ్చు. అందుకని ఏ మందులు వేసుకోవాలన్నా వైద్యుడి సలహా తప్పనిసరి!
చాలామంది పట్టించుకోనిది మానసిక ఒత్తిడి. సమస్యలవల్లే ఒత్తిడి కలుగుతుందనుకోవడం పొరబాటు. మన జీవన విధానంలోనూ ఒత్తిడి పెరుగుతుంది. ఉదాహరణకి ఒక అబద్ధం చెప్పామనుకోండి, దాన్ని కప్పి పుచ్చుకోవడానికి మరెన్నో అబద్ధాలాడాల్సి రావచ్చు. దాంతో మానసిక ఘర్షణ ఎక్కువవుతుంది. మన మనస్సుకి వ్యతిరేకంగా ఏ పని చేసినా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆఫీస్‌కి చివరి నిమిషంలో బయలుదేరి, సుమయం మించిపోతోందని కంగారుపడడంకన్నా ముందే బయల్దేరవచ్చుగా! అందుకని జీవన విధానాన్ని కొద్దిగా మార్చుకోవడం అవసరం.
చివరిదే కాదు ముఖ్యమైనది- ఆహారపుటలవాట్లు. దీనిని కూడా వైద్యుడు చెప్పినట్లే చేయాలి. కొవ్వు పదార్థాల్ని తినకూడదు. మీ గుండె మీ శరీరంలో ఉన్నా తీసుకోవలసిన జాగ్రత్తలు మీ చేతుల్లో ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ గుండెని పదిలంగా ఉంచుకోండి.
*

-డా రవికుమార్ ఆలూరి గుండె, రక్తనాళాల వైద్య నిపుణులు కిమ్స్, కొండాపూర్, హైదరాబాద్.. 9848024638