సంజీవని

ఫుల్ బ్లడ్ కౌంట్ ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని సందర్భాలలో వైద్యుడు మనల్ని ఎఫ్.బి.సి చేయించమంటుంటాడు. ఎఫ్.బి.సి అంటే ఫుల్ బ్లడ్ కౌంట్. రక్తం ద్వారా ఎన్నో రకాల కణాలు శరీరంలో సంచరిస్తుంటాయి. ఈ కణాల్ని ప్రధానంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. శరీర భాగాలకు ఆక్సిజన్‌ని చేర్చి, అక్కడున్న కార్బన్ డయాక్సైడ్‌ని వెనక్కి తెచ్చేవి ఎర్ర రక్తకణాలు. శరీరంలోకి ఏవైనా సూక్ష్మజీవులు ప్రవేశించినపుడు వాటితో పోరాడి, వాటిని చంపేవి తెల్ల రక్తకణాలు. మూడో విభాగం ప్లేట్‌లెట్స్. ఇవి రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంటాయి.
ఎర్ర రక్తకణాలు తగ్గితే శ్వాసించడం కూడా కష్టమవుతుంటుంది. ఎనీమియా కలగవచ్చు. శరీరంలో ఎక్కడ ఇన్‌ఫెక్షన్ వచ్చినా లోపలికి ప్రవేశించిన సూక్ష్మజీవుల్ని చంపడానికి తెల్లరక్తకణాలు ఎక్కువగా పుడతాయి. తెల్ల రక్తకణాల సంఖ్య ఎక్కువైతే శరీరంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు అర్థమవుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గిపోతుంటుంది. అదీ అపాయమే. అందుకని ప్లేట్‌లెట్స్ ఎక్కించి, రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగుపాళ్ళలో ఉండేలా చూస్తారు వైద్యులు.
ఆరోగ్యంగా ఉన్నవాళ్ళలో ఈ మూడు రకాలు రక్తంలో ఉండాల్సిన పరిమితులలో ఉంటాయి.
ఎర్ర రక్తకణాలు తగ్గి ఎనీమియా వస్తే నీరసంగా ఉంటుంది. అలసిపోయినట్లనిపిస్తుంటుంది. కొన్ని ఇన్‌ఫెక్షన్స్‌వల్లా ఇలా ఉండవచ్చు. ఇన్‌ఫెక్షన్‌లో ఇంతకుముందు మనం అనుకున్నట్లు తెల్ల రక్తకణాల సంఖ్య ఎక్కువవుతుంది. అందుకని ఎఫ్.బి.సి పరీక్షవల్ల రక్తంలోని ఈ మూడు రకాల పదార్థాలు ఎలా ఉన్నాయి? వాటి నిష్పత్తి సరిగ్గా ఉందా? కొంతవరకూ పసిగట్టవచ్చు.
మామూలుగా మనం వేసుకున్న మందులు, పీల్చేవి, ఇంజెక్షన్స్ ద్వారా లోపలికి వెళ్ళే రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుంటాయి. వీటిని, ఇంకా ఏవైనా కొత్త పదార్థాలు రక్తంలో ఉంటే వాటిని పసిగట్టి కొంతవరకూ అనారోగ్య కారణాన్ని తెలుసుకోవచ్చు.

డా.కె.వలీపాషా డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రి యోగి వేమన విశ్వవిద్యాలయం.. 98492 16278