సాహితి

అక్షర దీపికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదో సన్నని రాగం
చెవిలో వినిపిస్తుంది
ఏదో కరుణ తరంగిణి
ఆ స్వరం మోసుకొస్తూ వుంది

రెండు కొండల మధ్యలో
నది పాయగా వెళుతూ
కొండతో చెప్పిన ముచ్చట్లు
వినిపిస్తున్నాయి

‘నదికి కదా గాయాలవ్వాలి
కొండకేమిటి’ అంది నది
అప్పుడు కొండ స్నేహితా
ఇప్పుడు నదీ తరంగాలు పదును తేరాయి

తరగల్లో సూర్యుడు అద్దం చూసుకొంటున్నప్పుడు
నది ప్రజ్వలనం అవుతుంది
బింబ ప్రతిబింబ భావం పొందుతోంది
నది కోయిల పాటలు ఆలపిస్తుంది
నేనేముంది ఎండకు ఎండి
వానకు తడవడం తప్ప అంది.
అందుకు నది - ‘బాగా పొగిడేశారు
మీ రక్షణ కవచం లేకుండా
ఇవన్నీ చేయగలుగుతున్నానా
మీ నిబ్బరం, ఓపిక
దీర్ఘదృష్టి నాకు పెద్ద అండ కాదా’ అంది
కొండ తనలో తాను నవ్వుకుంది
పరస్పరాధిరతమైన
ప్రకృతంతా ఎంతో పరవశవౌతుంది
ఆత్మగౌరవం పోకుండానే వ్యక్తిత్వ పూర్ణగా అవి
వర్థిల్లుతున్నాయి కదా!
రాగమేదైనా అది మాధుర్యమైతేనే
కర్ణపేయ వౌతుంది
అవును! మెదడుకు విశ్రాంతినిచ్చేది సంగీతమే
ప్రతి గీతంలోను ఒక లయబద్ధత వుంటుంది
ఆ మంచులో తడిసిన పల్లె
ముత్యాలు అలంకరించుకొన్నట్టు
ఏదో మూగ బాసలో పలకరిస్తుంది
సూర్య కిరణాల వేడి ఆ మల్లికి
తగలకముందే ఆ పూలు విచ్చుకొన్నాయి
లండన్ హౌసాఫ్ కామన్స్ దగ్గర
పావురాలు గుంపులుగా ఎగురుతున్నాయి
ముంబయి సముద్రం ఒడ్డున
పావురాలను చూశాను
మలేషికొండల మీద ఎదిగిన
చెరకు గడలను చూశాను

శిశువును మరణించకుండా చూస్తారు
ఆ కడుపులోనే భ్రూణహత్యకు
గురవుతున్న పసి పిండాలు రక్షించబడతాయి

మాతృత్వం వికసిస్తుంది
జీవించే హక్కు అందరి సొంతం

ఆ నది స్వరాన్ని నేను వింటూనే వున్నాను
ఆ శ్రుతి నుండి ప్రేమ దీపాలు వెలిగించాలి

- కత్తి పద్మారావు, 9849741695