హైదరాబాద్

స్థల సేకరణ సరేసరి రోడ్డు విస్తరణ పనులమాటోమరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, మే 1: మెట్రో కారిడార్ మార్గాలు ప్రమాదాలకు రాస్తాలుగా మారుతున్నాయి. ప్రదాన కారిడార్ మార్గాలలో పిల్లర్ల నిర్మాణాలు పూర్తయినా సమస్యలు తప్పటం లేదు. రోడ్డు విస్తరణ కోసం కూల్చివేతలు జరిగి స్థల సేకరణ జరిగినా విస్తరణ పనులు పూర్తికావటం లేదు. విస్తరణ పనులలో భాగంగా ప్యాచ్ వర్క్ పనులు నత్తకే నడక నేర్పేవిదంగా మారాయి. ఫలితంగా ట్రాఫికర్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. రోడ్లపై ఉన్న స్తంబాల కారణంగా వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. మరి కొన్ని మార్గాలలో ఫిల్లర్ల పనులు పూర్తి కాలేదు. ఫలితంగా రోడ్డు చిన్నగా మారటంతో నిత్యం ట్రాఫిక్ జామ్‌లు సంభవిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఆనేకసార్లు అత్యవసరంగా రోగులను ఆసుపత్రులకు తరలించటానికి అంబులెన్సులు ట్రాఫిక్ చట్రంలో ఇరుక్కు పోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి చిలకలగూడ, గాంధీ అసుపత్రి, ముషీరాబాద్, గోల్కొండ క్రాస్‌రోడ్, రాజాడీలక్స్, ఆర్టీసి క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ మీదుగా వెళ్లే మెట్రో మార్గం నిత్యం సమస్యలకు నిలయంగా మారింది. ముఖ్యంగా ఆర్టీసి క్రాస్‌రోడ్‌లో వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సినిమా ధియేటర్లు, బిర్యాని హోటళ్లు, విద్యా సంస్థలు, కొచింగ్ సెంటర్లకు నిలయమన్న విషయం తెలిసిందే..! ఇక్కడ ప్యాచ్ వర్క్ పనులు పూర్తి కాక పోవటంతో ఒక్కోసారి కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్లపై ఉన్న స్తంబాలను అనేక ప్రాంతాలలో తొలగించకపోవటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడి చందన బ్రదర్స్ దగ్గర ఇప్పుడిప్పుడే పిల్లర్ల పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణానికి గాను రోడ్డు మద్య రేకులు ఇరు వైపుల అమర్చటంతో కేవలం ఒక్క బస్సుమాత్రమే వెళ్ల అవకాశం ఉండటంతో వందలాది వాహనాల రాకపోకలు స్తంబిస్తున్నాయి. ఇక పుట్ పాత్‌ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీసం నడవటానికి ఏ మాత్రం వీలు లేని పరిస్థితి నెలకొంది. పాదచారులు, మహిళలు, విద్యార్ధులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. కేబుల్ వైర్లు, కరెంట్ తీగలు వేలాడుతూ రాకపోకలకు అంతరాయం కలిగస్తున్నాయి. సంబందిత శాఖల మద్య సమన్యయ లోపం, నిర్లక్ష్యం కారణంగా సమస్యలు అపరిష్కృతంగానే మిగులుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు మాత్రం వాహనదారులకు చాలాన్‌లు విధించే విషయంలో చూపించే శ్రద్ద ట్రాఫిక్‌ను క్లీయర్ చేసే విషయంలో చూపటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైగా పొలీస్‌లు సిగ్నల్స్ అంటూ చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలని అన్ని వర్గాలు సూచిస్తున్నాయి.