హైదరాబాద్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం సికింద్రాబాద్ వాసుల ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, మే 1: తెరాస ప్రభుత్వం పేదలకు నిర్మించ తలపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం సికింద్రాబాద్ వాసులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. తమకు అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో, మంత్రివర్యులు నిర్మాణాలకు ఎప్పుడు శంకుస్థాపనలు చేస్తారోనని ఎదురుచూస్తున్నారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేక చొరవ చూపించినప్పటికీ అప్పట్లో ఓయు భూములు తీసుకుని నిర్మాణాలు చేపడుతామని చెప్పిన మాటకు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రత్యామ్నాయ స్థలం కోసం మంత్రి పద్మారావు అధికారులతో కలిసి తీవ్రంగా అనే్వషించినప్పటికీ ఇప్పటి వరకు శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, మధ్యలో ఎన్నికలు రావడంతో ఈ పరిశీలన కార్యక్రమాలు పక్కనపెట్టినట్టు కనిపిస్తోంది. ఇపుడు ఎన్నికల హడావిడి కూడా ముగిసింది. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వ పనితీరుకు మంత్రి భరోసాను నమ్మి అత్యధిక మెజార్టీతో నియోజకవర్గంలో గులాబీ తప్ప మరో పార్టీకి అవకాశం ఇవ్వలేదు. దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మంత్రిపై మరింత బాధ్యత పెరిగిపోయింది. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో అక్కడడక్కడా ఉన్న ప్రభుత్వ స్థలాలు చిన్నచిన్న సమస్యలతో ఉన్నాయి. వాటిని మంత్రి కల్పించుకుని పరిష్కరిస్తే వేలాదిమంది కుటుంబాలకు మేలు జరగడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. ఒక్క తార్నాక డివిజన్‌లోనే పేదలకు ఇళ్ల నిర్మాణానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను మంత్రి పద్మారావు రెవెన్యూ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ప్రభుత్వ బోర్డుతో ఉన స్థలాలు ఒక ప్రాంతంలో దాదాపు నాలుగువేల గజాలు, మరో ప్రాంతంలో తొమ్మిది వందల చదరవుగజాలు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా తార్నాక ఎర్రకుంట ప్రాంతంలో సైతం కబ్జాదారుల బారి నుంచి రక్షించడానికి గుర్తించిన రెవెన్యూ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేపడితే ప్రభుత్వ లక్ష్యం పేదల కోరిక తీరిపోయే అవకాశం ఉంది. మరో వైపు ఏపి డైరీ వెనుకవైపు ఎర్రకుంట ప్రాంతంలో ఉన్న డైరీ క్వార్టర్స్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో కార్మికులు దాదాపు అందరు ఖాళీచేసి వెళ్లిపోయారు. ఆ క్వార్టర్స్ ప్రక్కనే ఉన్న వేల గజాల స్థలం కూడా కబ్జా చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి చొరవ తీసుకుని డైరీ క్వార్టర్స్ పక్కన ఖాళీగా ఉన్న స్థలాన్ని తీసుకుని ప్రత్యామ్నాయంగా ఏపి డైరీకి మరోచోట స్థలం కేటాయిస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. తాజాగా తలసాని మంత్రిత్వశాఖలో భాగమైన ఏపి డైరీ ఆవరణలోని స్థల సేకరణకు మంత్రి పద్మారావు చొరవచూపితే సమస్య అత్యంత సులువుగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా నిర్మానుష్యంగా ఉన్న డైరీ క్వార్టర్స్‌లో కార్మికులు ఎవరూ నివాసం ఉండకపోవడంతో ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. నిర్మానుష్యంగా, నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని ఉపయోగంలోకి తీసుకురావడంతో పాటు పోలీసులు ఈ ప్రాంతాల్లో నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.