వరంగల్

శంభో.. శివ శంభో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు * భక్తులతో పోటెత్తిన ఆలయాలు
వరంగల్, మార్చి 7: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం ఆలయాలన్ని శివనామస్మరణతో మార్మోగిపోయాయి. మహా శివరాత్రిని పురస్కరించుకుని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన కురవి వీరభద్ర స్వామి ఆలయం, కొమురవెల్లి మల్లన్న క్షేత్రం, ఐనవోలు తదితర క్షేత్రాల్లో జాతరలకు భక్తజనం పోటెత్తింది. భక్తి ప్రపత్తులతో పరమశివున్ని ప్రార్థించారు. త్రిదళం, త్రిగుణాకరం అన్న చందంగా కొండంత దేవునికి కోటి పత్రి కాకపోయినా భోళా శంకరునికి ఒక పత్రితోనైనా పూజలు జరిపి కరుణ పొందారు. ఆలయాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయ. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. నమఃశివాయ, శివాయ నమః.. శంభో శంకరా... హరహర మహాదేవ నినాదాలతో వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాలు మార్మోగిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో శివాలయాలు సందడిగా మారాయి. నగరంలోని వేయిస్తంభాల రుద్రేశ్వర ఆలయంలో భక్తజనం పోటెత్తింది. స్థానిక ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ దంపతులు పట్టువస్త్రాలతో ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. జిల్లా ఎస్పీ అంబర్‌కిషోర్ ఝా దంపతులు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐనవోలులోని మల్లికార్జునస్వామి దేవాలయం, కొమురవెల్లిలోని మల్లన్న దేవాలయం, పాలకుర్తిలోని సోమేశ్వర ఆలయం, కురవిలోని వీరభద్రస్వామి ఆలయం, మడికొండలోని మెట్టుగుట్ట ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము 3గంటల నుంచే ఆయా ఆలయాల్లో భక్తుల రాక మొదలైంది. తెల్లవారుజామునే స్నానాలు ఆచరించి ఇళ్లలో పూజలు జరిపి అనంతరం భక్తులు దేవాలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. పరమశివునికి ఇష్టమైన రుద్రాభిషేకాలు జరిపారు. వేయిస్తంభాల రుద్రేశ్వర ఆలయం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు నిండిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శివరాత్రి సందర్బంగా వేయ స్తంభాల ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. ములుగు రోడ్డునుండి వచ్చే వాహనాలను పెద్దమ్మగడ్డ నుండి కెయుసి రోడ్డుకు మళ్లించారు. అలంకార్ జంక్షన్ నుండి మచిలీబజార్ మీదుగా మళ్లించారు. కాగా వేయ స్తంభాల రుద్రేశ్వరాలయంలో రాత్రి శివకల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో లింగోద్భవ సమయంలో స్వామివారి మీద బిల్వపత్రాన్ని సమర్పించి భక్తజనం ఓం నమః శివాయ అని భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. ఆలయంలో జరిగిన సాహితీ సంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్ర ముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమాలకు ప్రజానాయకులు, ప్రభుత్వ పాలకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.