జాతీయ వార్తలు

దీక్ష విరమించవద్దని షర్మిలకు బెదిరింపులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్: పదహారేళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించుకోవద్దని, బయటి వ్యక్తిని వివాహం చేసుకోవద్దని ‘మణిపూర్ ఉక్కుమహిళ’ షర్మిలకు కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లుగా ఆమె దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆమె కోర్టుకు హాజరైనపుడు మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 9న నిరాహార దీక్ష ముగిస్తానని, వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని, రాజకీయాల్లో ప్రవేశిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ప్రకటనపై మణిపూర్‌కు చెందిన కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దీక్షను కొనసాగించాలని, బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని, మణిపూర్ ప్రజలకు స్వేచ్ఛ లభించేవరకూ ఉద్యమం కొనసాగించాలని ఆ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.