జాతీయ వార్తలు

నేను అమరత్వం పొందాలని కోరుకుంటున్నారు : ఇరోం షర్మిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్‌: ‘ నేను ఓ దేవతలా ఉండాలని ప్రజలు అనుకుంటున్నారు... ఇలాగే పోరాడి అమరత్వం పొందాలని కోరుకుంటున్నారు... కానీ- నేను సాధారణ మనిషిలా ఉండాలని అనుకుంటున్నా’నని మణిపూర్‌కు చెందిన ప్రముఖ హక్కుల నేత ఇరోం చాను షర్మిల అన్నారు. ఏఎఫ్‌ఎస్‌పీఏ కు వ్యతిరేకంగా షర్మిల 16ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను నిన్న ముగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిల బుధవారం ఓ న్యూస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ- ఆర్మీ దళాల ప్రత్యేక హక్కుల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు కోరుతూ తాను దీక్ష కొనసాగించి ప్రాణత్యాగం చేసి చరిత్రలో నిలిచిపోవాలని కొందరు కోరుకుంటున్నారని చెప్పారు. మణిపూర్‌లో పూర్తి ప్రజాస్వామ్యం వచ్చేవరకు పోరాడుతూనే ఉంటానని చెప్పారు. దీక్ష విరమించినా రాజకీయాల్లో చేరి ఏఎఫ్‌ఎస్‌పీఏ చట్టంపై పోరాడుతానని, ఈ చట్టం రద్దు చేయడానికి మణిపూర్‌ సీఎం అవ్వాలని తాను కోరుకుంటున్నట్లు షర్మిల పేర్కొన్నారు.