జాతీయ వార్తలు

ఇనోం షర్మిల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్:మణిపూర్‌లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ మంగళవారం మరోసారి నిరశన దీక్ష ప్రారంభించిన సామాజిక కార్యకర్త ఇనోం షర్మిలను బుధవారంనాడు మళ్లీ పోలీసులు అరెస్టు చేశారు. గత పదిహేనేళ్లుగా ఆమె ఇలా నిరశన దీక్షకు దిగడం, పోలీసులు ఆత్మహత్యాయత్నం కేసు నమోదు చేయడం మామూలే. కోర్టు తీర్పు మేరకు ఆమె సోమవారం విడుదలవగా మంగళవారం దీక్ష ప్రారంభించారు. ఆమె ఆహారం తీసుకోకపోవడంతో ముక్కులోంచి ఆహారాన్ని పంపేందుకు వైద్యులు ప్రయత్నించగా గొట్టాలను షర్మిల తొలగించారు. దీంతో ఆమె ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందన్న భయంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 2202నుంచి ఏకధాటిగా ఆమె దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.