జాతీయ వార్తలు

షీలాదీక్షిత్ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కన్నుమూశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె మూడు పర్యాయాలు పనిచేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1938 మార్చి 31 పంజాబ్‌లోని కపుర్తాలో జన్మించారు. తొలిసారి ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ నుంచి ఆమె ఎంపీగా గెలుపొందారు. ఆనాటి ఆమె రాజకీయప్రస్థానం ఇటీవల సార్వత్రిక ఎన్నికల వరకు సాగింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేసిన ఆమె ఢిల్లీ బీజేపీ చీఫ్‌ మనోజ్‌ తివారీ చేతిలో 3.66 లక్షల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు.