సాహితి

శుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగత నిద్ర ముసుగులో
మనసు పొరల్లో
చిరకాల స్వప్నాలు
బొమ్మకట్టుకుంటున్నాయి

మెల్లగా
నానుంచి నేను
అదృశ్యమైనట్టు భ్రమ
మనిషిని కదా...
ఆవేదనతో
ఆరాటంతో, అనే్వషణలో
మళ్ళీ నన్ను నేను
కలుసుకునేందుకు
నలుదిశలా పరుగుతీస్తున్నాను
నాలుగురోడ్ల కూడలిలో
హఠాత్తుగా
నా ముందు మల్లిరేకు వంటి మనిషి...!

ఆత్మీయ ఆలింగనాలు
ప్రేమ నిండిన కరచాలనాలతో...
కొద్ది కొద్దిగా నేనతని వద్దకెళ్ళాను
ననె్నగాదిగా చూస్తూ
హృదిచాలనం చేస్తూ
నా చేతుల్ని ఉలులుగా మార్చి
నన్ను చెక్కుతూ
నా మనస్సుని
బంతిని చేసి
మలినాలు లేని
మైదానంలోకి విసిరాడు..

- పల్లిపట్టు నాగరాజు 9989400881