హైదరాబాద్

వనస్థలిపురం ఎస్‌ఐ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, నవంబర్ 27: అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. షాపుల నుంచి వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలతో వనస్థలిపురం ఎస్‌ఐ సైదులుపై విచారణ చేయించారు. రేషన్‌షాప్ యజమానినుంచి నెల మామాళ్లు వసూలు చేసినట్లు, వివిధ కేసుల్లో నేరస్థులను అరెస్టు చేయకుండా డబ్బు తీసుకున్నాడని విచారణలో తేలింది. గణేశ్ ఉత్సవాల సమయంలో షామియాన షాపుల వద్ద తన సిబ్బందితో వసూలు చేసినట్లు తెలిసింది. సనత్‌నగర్ పిఎస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మన్సుర్ అలం అక్రమ వసూళ్లతోపాటు లచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు రావడంతో విచారణ చేయించారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు విచారణ చేసి నివేదికను కమిషనర్‌కు అందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ సైదులు, కానిస్టేబుల్ మన్సుర్ అలంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చాలా పోలీస్‌స్టేషన్లలో ఇదే తంతు జరుగుతుందని, సిపికి ఎస్‌బి అధికారులు సరైన ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.