హైదరాబాద్

ఎస్సీ వర్గీకరణపై సిఎం కేసిఆర్ వౌనం వీడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 6: ఎస్సీ వర్గీకరణపై సిఎం కెసిఆర్ వౌనం వీడి, స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈనెల 17న నిర్వహించనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ పోరాటంలో కెసిఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న మాదిగలను ఇప్పుడు మరిచారని మండిపడ్డారు. కృతజ్ఞత భావం లేకుండా కెసిఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీక్ష సమయంలో కెసిర్‌తో పది రోజలు అండగా ఉన్న మాదిగల కోసం పది సెకన్లు కేటాయించలేకుండా ఉన్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 22 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటంలో ఏనాడు కెసిఆర్ మద్దతును ప్రకటించ లేదని దుయ్యబట్టారు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి.. కెసిఆర్ నేతృత్వంలో ఢిల్లీకి వెళ్తామని ప్రకటించగా, వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా మంత్రులు హరీష్‌రావు, కెటిఆర్‌లు ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ ప్రకటించారని, కానీ, సిఎం మాత్రం ఒక్క మాట మాట్లాడక పోవడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి కేసిఆర్ తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై బిజెపిదే బాధ్యత అంటూ మంత్రులు ప్రకటించడం హాస్యస్పదమని, బిల్లు పెట్టే విధంగా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత టిఆర్‌ఎస్ నాయకులదేనని చెప్పారు. 22 సంవత్సరాలుగా సాగుతున్న ఎస్సీవర్గీకరణకు మద్దతు పలుకుతూ వచ్చిన బిజెపి, అధికారంలోకి వచ్చిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు పాటికి పదిసార్లు వర్గీకరణకు అనుకూలం అని చెప్పిన బిజెపి నేతలు.. ప్రస్తుతం ఆ ఉత్సాహాన్ని ఎందుకు పరిష్కరించడం లేదని దుయ్యబట్టారు. బిజెపి సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వాని, అధ్యక్షుని హోదాలో గడ్కారి ఈ విషయంపై లేఖలు రాశారని చెప్పారు. ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న సమయంలో సుష్మా స్వరాజ్ బిల్లు పెడితే తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారని గుర్తుచేశారు. కేంద్ర వైఖరికి నిరసనగా ఈనెల 17న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ఛలో ఢిల్లీ కార్యక్రమానికి ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం ఢిల్లీకి వెళ్తే తాము వెంట వెళ్తామని, అది కుదరని పక్షంలో తాము వెళ్లే సమయంలో అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు లింగస్వామి, నరేష్, పురుషోత్తమ్ పాల్గొన్నారు.